భారత్‌తో ఉద్రిక్తతల వేళ దాయాది పాకిస్థాన్ అగ్రరాజ్యం అమెరికా మధ్య స్నేహం బలపడుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ ప్రధాని (Pakistan PM) షెహబాజ్ షరీఫ్ యూఎస్ వెళ్లారు. ఈ సందర్భంగా శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భేటీ అయ్యారు. షరీఫ్ వెంట ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు.

అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.52 గంటలకు పాక్ ప్రధాని(Pakistan PM) షరీఫ్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ సీనియర్ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్‌కు మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. పాక్ ప్రధాని (Pakistan PM)గురించి ప్రస్తావించారు. పాక్ ప్రధానిని గొప్ప నాయకుడు అంటూ ప్రశంసించారు. ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ కావడం ఇదే తొలిసారి.
2025 లో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరు?
ఈ ఎన్నికలు మొదట 2023 లో నిర్వహించాలని అనుకున్నారు కానీ PTI మరియు పాకిస్తాన్ ఎన్నికల సంఘం మధ్య ఉన్న చట్టపరమైన సమస్య కారణంగా ఆలస్యం అయింది. 3 మార్చి 2024న, షెహబాజ్ షరీఫ్ దేశ 24వ ప్రధానమంత్రిగా రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు.
చైనా పాకిస్తాన్కు మద్దతు ఇస్తోందా లేదా భారతదేశానికి మద్దతు ఇస్తుందా?
చైనా పాకిస్తాన్‌కు ఆర్థిక, సాంకేతిక మరియు సైనిక సహాయాన్ని అందించింది; రెండు వైపులా ఒకరినొకరు సన్నిహిత వ్యూహాత్మక మిత్రులుగా భావిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలు చైనా యొక్క ప్రారంభ తటస్థ విధానం నుండి ప్రధానంగా పాకిస్తాన్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతతో నడిచే విస్తృత భాగస్వామ్యం వరకు పరిణామం చెందాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: