పహల్గాం దాడితో భారత్ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయి, ప్రపంచదేశాల విమర్శలతో అవమానభారంతో ఉన్న పాకిస్తాన్ ఏవిధంగానైనా భారత్ ను దెబ్బకొట్టాలనే ఆలోచనలతోనే ఉంటున్నది. ఇందులో భాగమే ఢిల్లీలో కారుపేలుడుతో ఉగ్రదాడికి పాల్పడింది. అంతేకాక ముస్లిం వైద్యులను కూడా ఉగ్రవాదులు తమవైపు తిప్పుకుని, దేశంలో
అనేకుల హత్యకు కుట్రపడింది. అయితే ఢిల్లీలో (Delhi) జరిగిన పేలుడు దాడులతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయినా కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్నిచోట్ల తనిఖీలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్న పలువురిని అరెస్టు చేసింది.
Read also: Supreme court :ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కీలక తీర్పు

Pathankot police arrest 15 year old minor involved in ISI espionage case
ఉగ్రముఠాతో సంబంధం ఉన్నవారు, ఉగ్రవాదులకు మద్దతుదారులను గుర్తించి అధికారులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాక్ కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ ఐ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పఠాన్ కోట్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన బాలుడు దాదాపు ఏడాదిగా ఐఎస్ ఐ ఏజెంట్లతో టచ్ లో ఉంటూ.. భారత సైనిక స్థావరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని వారికి లీక్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అరెస్టు చేసిన బాలుడితో పాటు పంజాబ్ కు చెందిన పలువురు మైనర్లకు కూడా ఐఎస్ ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
బాలురలపై చర్యలకు సిద్ధమైన అధికారులు
దీంతో వెంటనే పంజాబ్ లోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పాక్ తో సంబంధాలు కొనసాగిస్తోన్న ఇతర బాలురను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం పంజాబ్ లోని మైనర్ల ఆన్ లైన్ కార్యకలాపాలు, కదలికలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. భారత యువతను లక్షనయం చేసుకోవడానికి పాక్ నిఘా సంస్థ పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దేశాన్ని ఆస్థిరపరిచేందుకు, యువతలో భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపించేందుకు ఐఎస్ ఐ ఏజెంట్లు పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: