Terrorism: పహల్గాం ఉగ్రదాడితో ప్రపంచమే ఒక్కసారికి ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఉగ్రవాదులు 26 మంది పురుషులను హతమార్చడమేకాక నిర్భయంగా తప్పించుకునిపోయారు. అయితే జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి ది రెసిస్టెన్స్ ప్రంట్ (TRF) బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల టిఆర్ఎఫ్ ను అమెరికా ఉగ్రసంస్థగా కూడా ప్రకటించింది. ఈ నిర్ణయంపై పాకిస్థాన్ తాజాగా స్పందించింది. టిఆర్ఎఫ్ ను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది పాక్.

ఇద్దరు విదేశీమంత్రుల భేటీ
Terrorism: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో (Ishaq) మాట్లాడుతూ టిఆర్ఎఫ్ను ఉగ్రసంస్థగా ప్రకటించే సార్వభైమాధికారం అమెరికాకు ఉందని.. దీనిపై తమకు అభ్యంతరాలు లేవని తెలిపారు.
ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పాకిస్థాన్
కొన్నిరోజుల క్రితం అమెరికా టిఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా ముద్రపడిన అంతర్జాతీయ ఉగ్రవాదిగా (ఎజిటి)గా ప్రకటించింది. తమ జాతీయ భద్రతను కాపాడటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం ఉగ్రదాడికి న్యాయం చేసేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని విదేశాంగ మంత్రి మర్కో పేర్కొన్నారు. కానీ లష్కరే తయిబాతో పహల్గాం దాడికి లింక్ చేయడం సరికాదని పాకిస్థాన్ వ్యాఖ్యానించింది.
పహల్గాం ఉగ్రదాడికి ఎవరు బాధ్యత వహించారు?
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది.
టిఆర్ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై పాకిస్థాన్ ఎలా స్పందించింది?
అమెరికాకు ఆ హక్కు ఉందని పేర్కొంటూ, ఆ నిర్ణయంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Ultralight aircraft: రోడ్ పైన కూలిన విమానం.. ఇద్దరు పైలట్స్ మృతి