Pakistan drone : జమ్మూ–కాశ్మీర్‌లోని సమ్బా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన అనుమానాస్పద డ్రోన్ కనబడడంతో భద్రతా బలగాలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. అధికారుల సమాచారం ప్రకారం, ఈ డ్రోన్ పాకిస్తాన్‌లోని చక్ భూరా పోస్టు నుంచి భారత వైపు ప్రవేశించి ఘగ్వాల్ మండలంలోని రెగల్ గ్రామం పైగగనంలో కొన్ని నిమిషాలు మోయర్ చేసి తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లిపోయింది.
Read also: Housing-Plan: గృహాల నిర్మాణానికి వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం
డ్రోన్ దర్శనం జరిగిన వెంటనే BSF మరియు స్థానిక పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ ద్వారా ఎలాంటి పేలోడ్ (Pakistan drone) అంటే మత్తు పదార్థాలు, ఆయుధాలు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు — వదిలేసారా అన్న దానిపై బృందాలు పూర్తిగా పరిశీలిస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి డ్రోన్ కార్యకలాపాలు పెరగడంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :