हिन्दी | Epaper
16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌

Pakistan: బలూచిస్థాన్ లో చైనా సైన్యం.. ఆదుకోవాలని విజ్ఞప్తి

Rajitha
Pakistan: బలూచిస్థాన్ లో చైనా సైన్యం.. ఆదుకోవాలని విజ్ఞప్తి

పాకిస్తాన్ కు తలనొప్పిగా మారిన బలూచిస్థాన్ లో కీలకపరిణామాలు జరగనున్నాయి. దక్షిణాసియాలో వ్యూహాత్మక సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పాకిస్తాన్ లోని అస్థిర ప్రాంతమైన బలూచిస్థాన్ లో చైనా తనసైనిక బలగాలను మోహరించబోతోందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ప్రముఖ బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ ఈ మేరకు ఒక షాకింగ్ ప్రకటన చేశారు. చైనా-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక అనుసంధానం కేవలం బలూచిస్థాన్ (Balochistan) కే కాకుండా.. భారతదేశ భద్రతకు కూడా పెనుముప్పుగా పరిణమించబోతోందని ఆయన హెచ్చరించారు.

Read also: NASA: అతిపెద్ద లైబ్రరీకి తాళం.. రీఆర్గనైజేషన్ పేరుతో మూసివేత

Chinese troops in Balochistan

Chinese troops in Balochistan

జైశంకర్ కు బహిరంగ లేఖ

బలూచ్ ప్రతినిధి మీర్ యార్ బలూచ్.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు రాసిన బహిరంగ లేఖలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు ఇప్పుడు తుది దశకు చేరుకుందని ఈ క్రమంలో తన పెట్టుబడులను కాపాడుకోవడానికి చైనా నేరుగా తన సైన్యాన్ని బలూచిస్థాన్ గడ్డపై దంపేందుకు సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లోనే బలూచిస్థాన్ లో చైనా సైనికుల బూట్ల చప్పుడు వినిపించవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ కు పొంచి ఉన్న ముప్పు

బలూచిస్థాన్ లో చైనా సైనిక ఉనికి కేవలం స్థానిక సమస్య కాదని.. ఇది భారత భవిష్యత్తుకు కూడా సవాలుగా మారుతుందని మీర్ యార్ బలూచ్ విశ్లేషించారు. చైనా, పాకిస్థాన్ కూటమి అంతకంతకూ బలపడుతోందని.. దీనినిఅడ్డుకోవడానికి బలూచ్ స్వాతంత్ర్య పోరాట శక్తులకు అంతర్జాతీయ మద్దతు అవసరమని ఆయన కోరారు. భారత ప్రభుత్వం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ ధైర్యసాహసోపేతమైన చర్యలను ఆయన ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870