हिन्दी | Epaper

Latest Telugu News: Pak vs Afg: పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో దాడులు..40మంది మృతి

Vanipushpa
Latest Telugu News: Pak vs Afg: పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో దాడులు..40మంది మృతి

దాదాపు వారం రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్(pakistan Afganistan) లమధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. పాక్ సైన్యం ఆఫ్ఘానిస్తాన్ పై దాడికి దిగింది. ఇందుకు ప్రతిగా తాలిబన్లు కూడా దాడులు చేస్తున్నారు. సరిహద్దుల్లో ఇరు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఘర్షణలో దాదాపు 40మంది తాలిబన్లను హతమార్చినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది.

Read Also: Telangana Agricultural: విస్తృతంగా వ్యవసాయ విద్య, పరిశోధనలు

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో దాడులు..40మంది మృతి
పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో దాడులు..40మంది మృతి

48 గంటల కాల్పుల విరమణకు అంగీకారం

అయితే అంతకు ముందే పాక్, ఆఫ్ఘాన్ దేశాలు 48 గంటల కాల్పుల విరమణకు అంగీకించాయి. తాలిబన్లు కోరితే తాము ఈ ఒప్పందానికి వచ్చామని పాక్..ఆదేశం అడిగితేనే తాము ఒప్పుకున్నామని రెండు దేశాలు చెప్పుకున్నాయి. ఇంతా చేస్తే అది కూడా కేవలం నోటి మాట కిందనే ఉండిపోయింది. కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్, ఆఫ్గాన్ లు ఘర్షణ పడ్డాయి. బోర్డర్ వెంబడి పరస్పరం దాడులకు పాల్పడ్డాయి.

సామాన్యుల మీద కూడా కాల్పులు

ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా అఫ్గాన్‌ తాలిబన్లను హతమార్చామని పాక్‌ సైన్యం తెలిపింది. బలోచిస్తాన్ ప్రాంతంలో తాలిబ్లు దాడులకు తెగబడ్డారని..సామాన్యుల మీద కూడా కాల్పులు జరిపారని పాక్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగానే తాము దాడులను నిర్వహించామని చెప్పింది. ఈ ఘర్షణల్లో నిషేధిత తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ముష్కరుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో కూడా ఆఫ్ఘాన్లు పోస్టులను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారని చెప్పింది.

సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం

అయితే, ఆఫ్ఘన్ వర్గాలు ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సామాన్య పౌరులు కూడా మరణించినట్లు, ఇది తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆఫ్ఘన్ గడ్డ నుంచి తమ దేశంపై జరుగుతున్న ఉగ్ర దాడులను ఇకపై సహించబోమని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో, రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల్లో ఒకరి పోస్టులపై మరొకరు దాడులు చేసుకోవడంతో పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఏర్పడింది. సరిహద్దుల్లో నెలకొన్న ఈ తీవ్ర ఉద్రిక్తతను తగ్గించడానికి సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

పెరిగిన వంట నూనె ధరలు

పెరిగిన వంట నూనె ధరలు

యుద్ధం విరమించాలంటూ ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

యుద్ధం విరమించాలంటూ ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

మోజ్తబా ఖమేనీ- 17 ఏళ్ల వ్యూహం, ఇరాన్ సుప్రీం లీడర్

మోజ్తబా ఖమేనీ- 17 ఏళ్ల వ్యూహం, ఇరాన్ సుప్రీం లీడర్

కుప్పకూలిన అమెరికా విమానం

కుప్పకూలిన అమెరికా విమానం

రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం, అమెరికాకు మొజ్తబా ఖమేనీ అల్టిమేటం

రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం, అమెరికాకు మొజ్తబా ఖమేనీ అల్టిమేటం

📢 For Advertisement Booking: 98481 12870