ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో భాగంగా జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో పాకిస్థాన్, ఒమాన్ జట్లు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇరుజట్లూ టోర్నమెంట్‌లో మంచి ఆరంభాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగాయి. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు శక్తివంతమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతుండగా, ఒమాన్ మాత్రం సరికొత్త ప్రతిభావంతులను వినియోగించి సర్ప్రైజ్ ఇవ్వాలని సంకల్పించింది.
టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Pakistan captain Salman Ali Agha) మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఒమన్ జట్టు ఫీల్డింగ్ బరిలోకి దిగనుంది.ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. తాము బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నామో తెలియజేశాడు. “మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం. ఇది మంచి పిచ్‌లా కనిపిస్తోంది. స్కోర్‌బోర్డుపై ఒత్తిడి పెంచాలని మేము కోరుకుంటున్నాం. గత 2-3 నెలలుగా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం.
ఎక్కువ పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
జట్టు ఒక పద్దతిలోకి వస్తోంది. ఇదే పద్ధతిని కొనసాగించాలని అనుకుంటున్నాం. మాకు ముగ్గురు మంచి స్పిన్నర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు సాధారణ స్కోరు కంటే ఎక్కువ పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.” అని పాక్ కెప్టెన్ వెల్లడించారు.అనంతరం ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ (Oman captain Jatinder Singh) మాట్లాడుతూ.. “ఒకవేళ టాస్ గెలిస్తే మేము కూడా మొదట బ్యాటింగే ఎంచుకునేవాళ్లం. ఆసియా దిగ్గజాలతో కలిసి ఆడటం మాకు ఒక చారిత్రక క్షణం.
6 నెలల క్రితం ఇది ఒక సవాలుగా అనిపించింది, కానీ మా కుర్రాళ్లు చాలా ఉత్సాహంగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకలితో ఉన్నారు. ఇది స్పిన్‌కు అనుకూలించే పిచ్.” అని పేర్కొన్నారు.జట్ల వివరాలు ఇలా..ఒమన్ (ప్లేయింగ్ XI): జతీందర్ సింగ్ (కెప్టెన్), ఆమిర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, హస్నైన్ షా, మహ్మద్ నదీమ్, జిక్ర్రియా ఇస్లాం, సుఫియాన్ మెహమూద్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.పాకిస్తాన్ (ప్లేయింగ్ XI): సైమ్ ఆయుబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.
Read hindi news: hindi.vaartha.com
Read also: