Erdogan Russia meeting : టుర్క్‌మెనిస్తాన్‌లో డిసెంబర్ 12న జరిగిన అంతర్జాతీయ ఫోరమ్ సందర్భంగా, పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావాల్సి ఉంది. అయితే ఈ ద్వైపాక్షిక సమావేశం అనుకోని మలుపు తీసుకుంది.
RT ఇండియా పంచిన వీడియో ప్రకారం, షరీఫ్ తన సమావేశం ఆలస్యమవ్వడంతో, పుతిన్ ఇప్పటికే టర్కీ అధ్యక్షుడు రెచెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో జరుపుతున్న క్లోజ్డ్-డోర్ మీటింగ్‌లో నేరుగా ప్రవేశించారు.
సమాచారం ప్రకారం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో కలిసి (Erdogan Russia meeting) 40 నిమిషాలకు పైగా ఎదురు చూసిన షరీఫ్, కనీసం చిన్న పరిచయం అయినా దక్కుతుందేమోనన్న ఆశతో లోపలికి వెళ్లారని తెలుస్తోంది.
అయితే, ఆయన సుమారు 10 నిమిషాల తర్వాత అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయారు.
ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పలువురు దీనిని దౌత్యపరమైన పొరపాటుగా అభివర్ణించారు. కొందరు యూజర్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్‌పై విమర్శలు చేశారు.
ఈ ఫోరమ్, టుర్క్‌మెనిస్తాన్‌కు ఉన్న 30 సంవత్సరాల శాశ్వత న్యూట్రాలిటీని గుర్తుచేసే వేడుక. ఐక్యరాజ్య సమితి 1995లో దీనిని అధికారికంగా గుర్తించింది. దీనిప్రకారం దేశం సైనిక కూటముల్లో చేరకూడదు, ఇతర దేశాల యుద్ధాల్లో పాల్గొనకూడదు, విదేశీ సైనిక స్థావరాలు అనుమతించకూడదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :