పొరుగుదేశమైన పాకిస్తాన్ (pak) ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్న విషయం ప్రపంచదేశాలకు తెలిసిన సత్యమే. ప్రత్యేకంగా భారతదేశంలో ఏ ఉగ్రదాడులు జరిగినా ఆ ఉగ్రవాదుల మూలాలు పాకిస్తాన్ లోనే ఉన్నట్లు పలు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయినా పాక్ ఈ సత్యాన్ని మాత్రం అంగీకరించదు. ప హల్గాంలో పాక్ ఉగ్రవాదులే భారతీయులను హతమార్చారు అని చెప్పినా, తాజాగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారుబాంబ్ పేలుడుకు కారణం పాక్ ఉగ్రవాదులే అన్న వాస్తవాన్ని భారత్ (India) ప్రకటిస్తున్నా అవన్నీ ఆరోపణే అంటూ కొట్టిపారేస్తూ ఉంటుంది పాక్. తాజాగా తన పొరుగు దేశమైన ఖైబర్ పంఖుఖ్వా ప్రావిన్స్ సీఎం కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. గత నెలలో ఖైబర్ పంఖుఖ్వా ప్రావిన్స్(Khyber Pakhtunkhwa) సీఎం సోహైల్ ఆఫ్రిది సీఎం అయ్యారు.
Read also : Telangana Meeseva : తెలంగాణలో మీసేవా ఇప్పుడు వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు మరింత చేరువ
ఈయన తాజాగా పాక్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఖైబర్ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద సంఘటనలను సృష్టిస్తోందని ఆరోపించారు. శాంతి కోసం చేస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకుంటోందని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన పష్తూన్ తహాఫుజ్ మూమెంట్ సభ్యులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. దీన్ని ఆఫ్రిది తీవ్రంగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్, తమకు మధ్య ఏర్పడిన సంబందాలను అడ్డుకునేందుకు ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తోందని ఆఫ్రిది ఆరోపించారు.

సొంత ప్రజలనే చంపుతున్న పాక్
ఖైబర్ పంఖుఖ్వాలో కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలను సీఎం ఆఫ్రిది తీవ్రంగా ఖండించారు. సాయుధదళాలు ఉగ్రవాద ఏరివేత పేరుతో పౌరులను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సొంత ప్రజలనే చంపుతూ.. ఉగ్రవాదంపై యుద్ధం అని పేరు పెడుతున్నారని అన్నారు. శాంతి ప్రయత్నాలకు భంగం కలిగించేవారిని ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఇటీవల పఖుంఖ్వా ప్రావిన్స్ లోని తిరా లోయలోని పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో అనేకమంది మహిళలు, చిన్నారులతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు, సైనిక కార్యకలాపాలను సమర్థించుకునేందుకు ఇస్లామాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతుందని ఆఫ్రిది ఆరోపించారు.
పోలీసులే లక్ష్యంగా బాంబు దాడులు
అక్టోబర్ మాసంలో ఖైబర్ పఖుంఖ్వాలో పోలీసులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. షెషావర్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పోలీస్ అధికారులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో తొమ్మిదిమంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించింది. దీని తరువాత అక్కడ పెద్ద భద్రతా బలగాలను మోహరించారు. పేలుడికి కారణమైన పరికరాన్ని పోలీసులు తిరిగే మార్గంలో అమర్చారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :