అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ (Pakistan) ఎప్పుడూ భారత్ ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా..ఇండియా మీద బురద జల్లుదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా కశ్మీర్ (Kashmir)అంశాన్ని ప్రతీ అంతర్జాతీయ వేదిక మీద లేవనెత్తుతుంది. కానీ ఇలా చేసిన ప్రతీసారి అవమానాన్నే ఎదుర్కొంటుంది. తాజాగా ఈరోజు జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలా సమావేశంలో కూడా ఇదే జరిగింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ అనేక పచ్చి అబద్ధాలు చెప్పింది.

గట్టిగా సమాధానం చెప్పిన పర్వతనేని హరీష్
ఐక్యరాజ్య సమితిలో మహిళలు, శాంతి భద్రతలపై జరిగిన చర్చల్లో పాక్ మరోసారీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. పాక్ అధికారిణి సౌమా సలీమ్ మాట్లాడుతూ..కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక గురైయ్యారంటూ ఆరోపణ చేశారు. దీనికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చాలా గట్టిగా సమాధానం చెప్పారు. తమను ఒకమాట అనే ముందు తమ సొంత దేశం ఏం చేసిందో గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు. తమ దేశంలో మహిళలు, శాంతి భద్రతలకు సంబంధించిన మార్గదర్శకాలు సరిగ్గానే ఉన్నాయని చెప్పారు. దురదృష్టవశాత్తు.. ప్రతి సంవత్సరం మన దేశానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుదారి పట్టించే ప్రసంగాలను వినవలసి వస్తుందని చెప్పారు.
Eswatini : వామ్మో ఆ రాజుకు 125 మంది భార్యలాట..!!
సొంత దేశంపైనే బాంబులు వేస్తున్న పాకిస్తాన్
కానీ పాకిస్తాన్ మాత్రం సొంత దేశంపైనే బాంబులు వేస్తూ మారణహోమానికి పాల్పడుతుందని ఆరోపించారు. మహిళలను టార్చర్ చేయడంలో పాకిస్తాన్ కు దారుణమైన రికార్డులున్నాయని హరీష్ అన్నారు. 1971లో నిర్వహించిన ఆపరేషన్ సెర్చ్ లైట్ లో పాక్ సైన్యం 4లక్షల మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి అనుమతించింది. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ లో బెంగాలీలను అణిచేందుకు ఈ ఆపరేషన్ ను చేశారు. లక్షల మంది మహిళలను నిర్భంధించి, దారుణంగా హింసించారు. ఈ పరిణామాలు భారత్, పాక్ యుద్ధానికి కూడా దారి తీశాయి.
ఆర్టికల్ 370 ఎప్పుడు తొలగించబడింది?
2019 ఆగస్టు 5న, భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కింద మంజూరు చేయబడిన ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది.
2019లో జమ్మూ కాశ్మీర్ నుండి ఏ కేంద్రపాలిత ప్రాంతం వేరు చేయబడింది?
లడఖ్ - భారత కేంద్రపాలిత ప్రాంతం
ప్రసిద్ధ సింధు, నుబ్రా మరియు ష్యోక్ నది లోయలు లడఖ్‌లో కనిపిస్తాయి. భారత ప్రభుత్వం 2019లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించిన తర్వాత, లడఖ్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విభజించారు.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: