Pak-Afg: హమ్మయ్య ఎట్టకేలకు పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లమధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇటీవల టర్కీలో జరిగిన సమావేశంలో చర్చలు విఫలం కావడంతో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్ భారత్ పై అసత్య ఆరోపణలు చేశారు. అందుకే ఆఫ్ఘన్ యుద్ధం వైపే మొగ్గు చూపుతుందని నోరుపారేసుకున్నారు. అయితే రెండో దఫాలో జరిగిన చర్చలు ఫలించాయి. ఇస్తాంబుల్ లో జరిగిన చర్చలు ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. పాకిస్తాన్, (pakistan) ఆఫ్ఘనిస్థాన్ లు కాల్పుల విరమణను మరోవారం పాటూ పొడిగించడానికి అంగీకరించాయని టర్కీ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. నవంబరు 6న ఇస్తాంబుల్ లో రెండు దేశాలు మళ్లీ సమావేశమవుతాయని చెప్పింది. శాంతి పరిరక్షణ నిర్ధారించే లేదా ఉల్లంఘించే వారిపై జరినామా విధించే పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని పార్టీలు అంగీకరించాయని తెలిపింది. విఫలమైన రెండో రౌండ్ చర్చలు అంతకు ముందు టర్కీ వేదికగా ఆఫ్ఘన్, పాకిస్తాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమైనట్టు రెండు దేశాల అధికార మీడియాలు ప్రకటించాయి.
Read also: 67: సోషల్ మీడియాలో సునామీలా విరజిమ్మిన 67!

Pak-Afg: పాక్, ఆఫ్ఘాన్ లమధ్య కాల్పుల విరమణ..
Pak-Afg: ఇందుకు ఒకరిపై ఒకరు నిందించుకున్నారు. అంతేకాక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్థాన్ భారత్ చెప్పినట్లుగా ప్రవర్తిస్తోందని, అందుకే తమ చర్చలు విఫలమైనట్లు చెప్పారు. అంతేకాక ఆఫ్ఘన్ ఒకవేళ యుద్ధానికి వెళితే, తాము ఐదురెట్లు అధికంగా దాడులు చేస్తామని హెచ్చరించారు ఆయన. దీంతో పాక్, ఆఫ్ఘన్ లమధ్య మళ్లీ యుద్ధం జరగవచ్చని అంతా భావించారు. పాక్ పై ఉగ్రదాడులకు తన భూభాగాన్ని ఉపయోగించబోమన్న హామీ ఇవ్వడం సహా ‘తార్కిక, చట్టబద్ధమైన డిమాండ్లను’ ఆఫ్ఘన్ అంగీకరించకపోవడం వల్లే ప్రతిష్టంభన ఏర్పడిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. దీంతో గత పదిరోజులుగా రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఖతార్, టర్కీల సమక్షంలో చర్చలే సఫలం ఖతార్, టర్కీల సమక్షంలో పాక్, ఆఫ్ఘన్ లు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. కాబూల్ రక్షణ మంత్రి ముహమ్మద్ యాకూత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ప్రతినిధి బృందాలు దోహాలో సమావేశంలో పాల్గొన్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల తాత్కాలిక ఒప్పందం కుదిరింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: