ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి లండన్(London)లో ఓ నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆయనకు అధికార హోదా దక్కడం పట్ల కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వీడియో చూసి హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, మీర్జాపుర్ జిల్లాలోని బటేవ్రా గ్రామానికి చెందిన మున్నాలాల్ మిశ్రా కుమారుడు రాజ్‌కుమార్ మిశ్రా (Raj kumar mistra)చండీగఢ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఐదు సంవత్సరాల క్రితం ఎంటెక్ చదవడానికి లండన్ వెళ్లారు. కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ప్రతాప్‌గఢ్‌కు చెందిన అభిషేక్తా మిశ్రాను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఇంజనీర్‌గా వర్క్ చేస్తున్నారు. దీంతో కుటుంబంతో రాజ్‌కుమార్ (Raj kumar mistra) లండన్‌లో స్థిరపడ్డారు. చాలా సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటుండడం వల్ల ఆయనకు లండన్ పౌరసత్వం లభించింది. దీంతో రెండు నెలల క్రితం లేబర్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బేలిగ్బౌరి నగర మేయర్‌గా గెలిచారు.

కుటుంబ హర్షం
తమ కుమారుడు మేయర్‌గా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని మున్నాలాల్ తెలిపారు. రోజూ తమతో మామూలుగా మాట్లాడుతాడని, కానీ నేడు ఓ మేయర్‌గా ఎన్నికై తమతో సంభాషించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. తమ కుటుంబమంతా హ్యాపీగా ఉందన్నారు. రాజ్‌కుమార్‌కు ఆయన సోదరులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంజనీర్ భార్యతో కలిసి స్థిర నివాసం
రాజ్‌కుమార్ మిశ్రా (Raj kumar mistra)తండ్రి మున్నాలాల్ మిశ్రా ఒక రైతు. తల్లి చంద్రకళి మిశ్రా గృహిణి. మున్నాలాల్‌కు పది మంది సంతానం. అందులో రాజ్‌కుమార్ మిశ్రా ఆరో వ్యక్తి. రాజ్‌కుమార్ అన్నయ్యలు కిషోర్ మిశ్రా, సునీల్ కుమార్ మిశ్రా న్యాయవాదులు. మిగతా సోదరులు రమేశ్ కుమార్ మిశ్రా పాఠశాల ప్రిన్సిపాల్‌గా, విపిన్ కుమార్ మిశ్రా వ్యవసాయంలో మాస్టర్ ట్రైనర్‌గా, శివ్‌జీ మిశ్రా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రాజ్ కుమార్ (Raj kumar mistra) తమ్ముడు పవన్ కుమార్ మిశ్రా ఒక రైతు కాగా, మరొకరు సర్వేష్ కుమార్ మిశ్రా ఒక వైద్యుడిగా సేవలందిస్తున్నారు. సోదరి అనితా కుమార్ మిశ్రాను వివాహం చేసుకుని ముంబయిలో స్థిరపడ్డారు.
Read Also: STALIN: సుప్రీం తీర్పును ప్రశ్నించిన ముర్ము – సీఎం స్టాలిన్ విమర్శలు