పెహల్‌గామ్ ఉగ్రదాడికి పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ భూభాగం మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత భద్రతా దళాలు ఈ తెల్లవారుజామున దాడులు చేపట్టాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ చర్యల్లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి.

మృతుల్లో మసూద్ సోదరి, బావ, మేనల్లుడు
తెల్లవారుజామున 1.05 గంటల సమయంలో, పాకిస్థాన్ మరియు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను ఈ దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా, పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసూద్ సోదరి, బావ, మేనల్లుడు సహా 10 మరణించారు.
ఈ దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులతో పాటు నలుగురు సహాయకులు కూడా మరణించారని మసూద్ అజార్ స్వయంగా పేర్కొన్నట్లు బీబీసీ ఉర్దూ కథనాలు ప్రచురించాయి. ఈ వార్త ఉగ్రవాద వర్గాల్లో తీవ్ర కలకలం రేపినట్లు సమాచారం.
Read Also : India Pakistan War: ఇండియాకు మద్ధతు తెలిపిన ఇజ్రాయెల్