Open AI : భారతదేశంలో AI రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందబోతోంది. ChatGPT తయారు చేసిన (Open AI), తన $500 బిలియన్ విలువైన స్టార్‌గేట్ ప్రాజెక్ట్ కోసం ఇండియాలో డాటా సెంటర్లు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా AI కంప్యూటింగ్‌కు కావాల్సిన ఆధునిక మౌలిక సదుపాయాలు నిర్మించబడతాయి. దీని వల్ల భారత IT, డేటా సెంటర్, రిన్యువబుల్ ఎనర్జీ రంగాలకు పెద్ద అవకాశాలు లభించనున్నాయి.
OpenAI ఇప్పటికే సిఫీ టెక్నాలజీస్, యోటా డేటా సర్వీసెస్, E2E నెట్‌వర్క్స్, CtrlS వంటి కంపెనీలతో చర్చలు మొదలుపెట్టింది. అలాగే రీలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి గుజరాత్‌లోని జమ్నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు గిగావాట్ స్థాయి విద్యుత్ సరఫరా, ఆధునిక కూలింగ్ టెక్నాలజీ అవసరం.
స్టార్‌గేట్ ప్రాజెక్ట్ 2024 జనవరిలో ప్రకటించబడింది. దీని కోసం సాఫ్ట్‌బ్యాంక్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు భాగస్వామ్యం అవుతున్నాయి. లక్షల సంఖ్యలో GPUs, అధునాతన చిప్స్, పవర్, కూలింగ్ సిస్టమ్స్ ద్వారా AI మోడల్స్ ట్రైనింగ్ చేయడం, నడపడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. ఇది నాలుగేళ్లలో దశలవారీగా అమలు కానుంది.
ప్రస్తుతం భారత్‌కి గ్లోబల్ AI మార్కెట్లో పెద్ద స్థానం లేదు — మొత్తం వాటాలో 1% కూడా రాదు. కానీ ఈ తరహా భారీ ప్రాజెక్టులు రాగానే, భారత్ AI రేసులో ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంటుంది.
OpenAI ఇప్పటికే భారత్‌లో సంస్థను రిజిస్టర్ చేసుకుంది. త్వరలో న్యూఢిల్లీ ఆఫీస్ ప్రారంభమవుతుంది. సామ్ ఆల్ట్మన్ కూడా ఈ నెలలో భారత్ వస్తున్నారు. ఈ సందర్శనలో OpenAI విస్తరణపై మరిన్ని వివరాలు రావచ్చని అంచనా.
అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి — నిరంతర విద్యుత్ సరఫరా, అధునాతన చిప్స్ లభ్యత, కూలింగ్ టెక్నాలజీ లాంటివి లభించకపోతే ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందనే ప్రమాదం ఉంది.
Read also :