వృద్ధాప్యంలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న(Ed Bombas) 88 ఏళ్ల అమెరికా ఆర్మీ మాజీ సైనికుడు ఎడ్ బంబాస్ జీవితం ఒక్క సోషల్ మీడియా(Social media) వీడియోతో మారిపోయింది. మిషిగాన్‌కు చెందిన ఈ వృద్ధుడు, పెన్షన్ కోల్పోవడం, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య వైద్య ఖర్చుల కోసం తన సేవింగ్స్ మొత్తాన్ని ఖర్చు చేశారు. దీంతో బతుకుదెరువు కోసం, గత ఐదేళ్లుగా ఒక సూపర్ మార్కెట్‌లో రోజుకు ఎనిమిది గంటల చొప్పున పనిచేస్తున్నారు. ఆయన కష్టాన్ని చూసి చలించిన ప్రపంచవ్యాప్త నెటిజన్లు ఏకంగా 1.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15 కోట్లు) విరాళంగా అందించారు, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
Read also: హెబ్బాళ్ ఫ్లైఓవర్ విస్తరణ వేగం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్

ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ చొరవ: ‘గోఫండ్‌మీ’ పేజీ ఏర్పాటు
ఎడ్ బంబాస్(Ed Bombas) దీనస్థితిని గమనించిన ఆస్ట్రేలియాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శామ్యూల్ వైడెన్‌హోఫర్, ఆయన పనిచేస్తున్న సూపర్ మార్కెట్‌లో ఒక వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కోటి మందికి పైగా వీక్షకులను చేరుకొని ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. వెంటనే స్పందించిన శామ్యూల్, ఎడ్ సహాయార్థం ‘గోఫండ్‌మీ’ పేజీని ప్రారంభించారు. ఎడ్ తన దేశం కోసం పోరాడారు. పెద్దలు, సైనికులు గౌరవంగా జీవించాలి. మనం సేకరించే ప్రతి డాలర్ ఆయన జీవన ఖర్చులు, వైద్య సంరక్షణకు ఉపయోగపడుతుంది అని శామ్యూల్ విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపునకు వేలాది మంది స్పందించి భారీగా విరాళాలు అందించారు. దీంతో ఎడ్ బంబాస్ సూపర్ మార్కెట్ ఉద్యోగానికి వీడ్కోలు పలికి, ప్రశాంతమైన విశ్రాంత జీవితాన్ని గడిపేందుకు అవకాశం లభించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: