ఇరాన్ (Iran) తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. పర్సియన్ గల్ఫ్‌లోని అత్యంత కీలకమైన హార్మోజ్ జలమార్గాన్ని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ ఓటు వేసింది. ఈ మార్గం భారత్‌కి ప్రత్యేకంగా ముఖ్యమైనది.హార్మోజ్ స్ట్రెయిట్ ద్వారా రోజూ భారత్‌కు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ (Barrels of crude oil) దిగుమతి అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతర్, యూఏఈ, ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్‌కు ఇదే ప్రధాన మార్గం. ఈ మార్గం ద్వారా ప్రపంచం మొత్తానికి 5 శాతం ఆయిల్, గ్యాస్ సరఫరా జరుగుతుంది.
యుద్ధ భగ్నం – ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఈ చర్య తీసుకుంది. అమెరికా నూక్లియర్ స్థావరాలపై దాడి చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ హార్మోజ్ మార్గాన్ని మూసేస్తోంది.హార్మోజ్ జలమార్గం అరేబియా మహాసముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. దీని వెడల్పు 33 కిలోమీటర్లు కాగా, ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్‌కి వాడే లైన్లు కేవలం 3 కిలోమీటర్లే. దాడులకు సులభంగా అవకాశమిచ్చే మార్గమిది.
ఇరాన్ నిర్ణయం వెనుక కారణం
ఈ మార్గం కంట్రోల్ లో ఉంచడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ఒత్తిడి తెచ్చే యత్నమిది. ఆయిల్ వ్యాపారంపై ప్రభావం చూపి తమకు అనుకూలంగా జియోపాలిటికల్ పరిణామాలు తీసుకురావాలన్నది ఇరాన్ లక్ష్యం.భారత్‌కు దీన్ని మూసివేత వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఉండవచ్చు. కానీ పారిశ్రామిక నిపుణులు అంతగా ఆందోళన చెందట్లేదు. ఇప్పటికే భారత్ రష్యా, అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు పెంచుతోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలను భారత ప్రభుత్వం అన్వేషించే అవకాశం ఉంది.
Read Also : Pawan Kalyan : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌పై పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు