ఒకరు నోబెల్ బహుమతి (Nobel peace prize) పొందితే అది ఆ దేశానికే ఎంతో గర్వం. తమ దేశస్తులు ఉన్నత బహుమతిని పొంది, తమ దేశప్రతిష్టని పెంచిందని ఉప్పొంగిపోతుంది. అవార్డు గ్రహీతలకు సన్మానాలతో ఉన్నతంగా గౌరవిస్తారు. కానీ వెనిజులా ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనిజులా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడోకు (Maria Corina Machado) వరించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఆ బహుమతిపై ఎన్నో ఆశల్ని పెట్టుకున్నారు. తాను 8యుద్ధాలను ఆపినట్లు, ఆ అవార్డుకు తానే అర్హుడినని చెప్పుకొచ్చారు. కానీ చివరిక్షణంలో వెనిజులా ప్రతిపక్ష నేత మచాడోకు వరించడంతో ట్రంప్ కోరిక నెరవేరలేదు.
Read Also: Reservations: తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపులో కీలక మార్పులు

దేశం బయటికి వెళ్తే నేరస్తురాలిగా ప్రకటిస్తాం
నోబెల్ శాంతి గ్రహీత మచాడో (58) కు కొత్త చిక్కులొచ్చాయి. డిసెంబరు 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. అవార్డు అందుకునేందుకు ఆ దేశానికి వెళ్లాలి. అయితే మచాడో దేశం దాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్తురాలిగా ప్రకటిస్తామని వెనిజులా అటార్నీ జనరల్ ప్రకటించారు. కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి ఆరోపణలు, పలు కేసులు ఉండడంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
నియంత పాలనకు వ్యతిరేకంగా మచాడో పోరాటం
దేశంలో నియంతృత్వంపై పోరాటం, ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన కోసం మచాడో పోరాటం చేస్తున్నారు. అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా తన గళాన్ని ఎత్తారు. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి రావాలని మచాడో పిలుపునిచ్చారు. పలు దేశాలు కూడా నికోలస్ కు వ్యతిరేకంగా గళమెత్తాయి. ఆమె పోరాటానికి ప్రతిఫలంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇప్పుడేమో అవార్డును అందుకోలేని పరిస్థితులు తలెత్తాయి. అటార్నీ జనరల్ ప్రటకనను లెక్కచేయకుండా మచాడో అవార్డు తీసుకుంటారా? లేక మౌనంగా ఉండిపోతారో వేచి చూడాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: