ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్(Nobel) పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. సోమవారం రోజున వైద్య విభాగంతో మొదలైన నోబెల్ విజేతల ప్రకటనలో, తాజాగా సాహిత్యంలో నోబెల్ పురస్కారం విజేతను ప్రకటించారు. ఈ ఏడాదికి గానూ హంగేరీకి చెందిన రచయిత లాజ్లో క్రాస్నహోర్కైకి ఈ పురస్కారం దక్కినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రపంచ వినాశన భయాల నేపథ్యంలోనూ కళకు ఉన్న శక్తిని ధృవీకరించే ఆయన ఆకర్షణీయమైన, దార్శనిక రచనల కోసం లాజ్లో క్రాస్నహోర్కైను ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. ఆయన రచనలు ఆధునిక ప్రపంచంలోని గందరగోళాన్ని, భయాన్ని లోతుగా విశ్లేషిస్తూనే.. మానవ అనుభవాన్ని, కళకు ఉన్న శక్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తాయని తెలిపింది.
Read also : Telangana: తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు

శాస్త్ర రంగాలలో విజేతలు
నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం వైద్య విభాగంతో ప్రారంభమైంది.
- వైద్య విభాగం: మేరీ ఇ బ్రున్‌కో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకాగుచీలు ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. రోగనిరోధక వ్యవస్థని ఎలా కంట్రోల్‌లో ఉంచుతారనే దానిపై వీరు చేసిన పరిశోధనలకు గానూ ఈ గౌరవం దక్కింది.
- భౌతిక శాస్త్రం (ఫిజిక్స్): జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్‌లు క్వాంటం మెకానిక్స్‌పై చేసిన విశేష కృషికి నోబెల్ బహుమతిని పొందారు.
- రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ): సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ యాఘీలకు ఈ పురస్కారం వరించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి కోసం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు నోబెల్‌కు ఎంపికయ్యారు.
నోబెల్ పురస్కార చరిత్ర
ఈ అత్యున్నత పురస్కారం స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్, బిజినెస్‌మెన్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన విజేతలకు అందజేస్తారు. ఆ రోజు జరిగే వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు, 10 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్లు) నగదును అందిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్(Alfred Nobel) 1896లో మరణించగా, 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
2025లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఎవరికి దక్కింది?
హంగేరీకి చెందిన రచయిత లాజ్లో క్రాస్నహోర్కైకి ఈ పురస్కారం దక్కింది.
నోబెల్ బహుమతి కింద ఎంత నగదు అందజేస్తారు?
పురస్కారంతో పాటు 10 లక్షల డాలర్లు (సుమారు రూ.8.8 కోట్లు) నగదును అందజేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :