రూపాయి విలువలో నమోదవుతున్న తగ్గుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) స్పందించారు. రూపాయి మార్కెట్‌లో తన స్వంత స్థాయిని తానే నిర్ణయించుకుంటుందని స్పష్టం కరెన్సీ మార్పులు సహజమేనని, దీనిని పూర్తిగా ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Read Also: Redmi 15C: మార్కెట్లో కొత్త ఫీచర్స్ తో రెడ్ మీ 5జీ

ఆమె మాటల్లో— కరెన్సీ విలువల్లో మార్పులు జరిగితే, ఎగుమతి రంగానికి అది కొంతవరకు లాభదాయకంగా మారుతుందని పేర్కొన్నారు. “ఎక్స్ఛేంజ్ రేట్లు చాలా సున్నితమైన అంశాలు. మేము ప్రతిపక్షంలో ఉన్న రోజులలో నిరసనలు చేసినా, అప్పుడు దేశ ఆర్థిక పరిస్థితులు ఇంత బలంగా లేవు. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడుందో చూసేయండి” అని హిందుస్థాన్ టైమ్స్ సమ్మిట్‌లో ఆమె తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఆమె వివరణ
మంత్రి సీతారామన్(Nirmala Sitharaman) ఇంకా మాట్లాడుతూ—
- దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుస్థిరంగా ఉందని,
- ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని,
- ప్రపంచ ఒత్తిడులను భారత ఆర్థిక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.
రూపాయి(Rupee) డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ మూలాధారాలు బలంగా ఉండటం సానుకూల సంకేతమని ఆమె అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: