అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు, ఐక్యరాజ్యసమితిలో మాజీ రాయబారి నిక్కీ హేలీ, (Nikki Haley) అమెరికా మునుపటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై స్పందించారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అమెరికా రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ(Nikki Haley) పేర్కొన్నారు. ఇండియాను స్వేచ్చాయుత, ప్రజాస్వామ్య భాగస్వామి (Democratic partner)గా భావించాలని ఆమె అన్నారు. న్యూస్‌వీక్ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో నిక్కీ హేలీ (Nikki Haley)వ్యాఖ్యలకు ప్రాధానత్య సంతరించుకున్నది.

విదేశాంగ విధానంలో ట్రంప్ సర్కారు కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. చైనాను అధిగమించే ఉద్దేశంలో.. భారత్‌తో వాణిజ్య రిలేషన్‌ను దెబ్బతీసుకోవద్దు అని ఆమె సూచించారు. రష్యా నుంచి ఇంధనం ఎగుమతి చేసుకుంటుందన్న ఆరోపణపై భారత్‌పై అదనపు సుంకాలు విధించేందుకు ట్రంప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. భారత్‌తో వాణిజ్య బంధానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఆ దేశంతో సంబంధాలను పెంచుకోవాలని ఆమె తెలిపారు. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని ఢీకొడుతున్న భారత్‌పై ఆంక్షలు విధించడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని ఆమె అన్నారు. చైనాతో వాణిజ్య బంధాన్ని తెంపుకున్న సమయంలో.. అమెరికాకు ఇండియా కీలకం అవుతుందని హేలీ పేర్కొన్నారు.
నిక్కీ హేలీ రాజకీయ చరిత్ర?
నిమ్రత నిక్కీ హేలీ (జననం 1972 జనవరి 20) అమెరికన్ రాజకీయవేత్త, దౌత్యవేత్త. ఆమె 2011 నుండి 2017 వరకు సౌత్ కరోలినాకు 116వ గవర్నర్‌గా, ఐక్యరాజ్యసమితిలో 29వ యునైటెడ్ స్టేట్స్ రాయబారిగా జనవరి 2017 నుండి డిసెంబరు 2018 వరకు పనిచేసింది. రిపబ్లికన్ పార్టీ సభ్యురాలుగా, ఆమె అధ్యక్ష క్యాబినెట్‌లో పనిచేసిన మొదటి భారతీయ అమెరికన్.
నిక్కీ హేలీ జీవితం
హేలీ భారతదేశంలోని పంజాబ్ అమృత్‌సర్ నుండి వలస వచ్చిన సిక్కు తల్లిదండ్రులకు దక్షిణ కరోలినాలోని బాంబెర్గ్‌లోని బాంబెర్గ్ కౌంటీ హాస్పిటల్‌లో నిమరత నిక్కి రంధవాగా జన్మించింది. ఆమె తండ్రి, అజిత్ సింగ్ రంధవా, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, ఆమె తల్లి రాజ్ కౌర్ రంధవా, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆమె న్యాయ పట్టా పొందింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: