
అమెరికాలోని మేరీల్యాండ్(Maryland) రాష్ట్రంలో తెలుగు యువతి నిఖిత(Nikitha Godishala) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించిన షాకింగ్ సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. వీడియోలో నిందితుడు అర్జున్ నిఖితపై దాడి చేస్తున్న భయానక దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేసినట్లు సమాచారం.
Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పూర్తి ప్రణాళికతోనే నిఖితను హత్య చేసిన అర్జున్, ఆ తర్వాత ఆమె మిస్సింగ్ అయ్యిందంటూ ఫిర్యాదు నమోదు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడని అధికారులు భావిస్తున్నారు. ఘటన అనంతరం భారత్‌కు పారిపోయిన నిందితుడిని ఇంటర్‌పోల్ సహకారంతో తమిళనాడులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: