News Telugu: ట్రంప్ పై అనేకులు ద్వేషాన్ని పెంచుకుంటున్నట్లుగా ఉన్నారు. అధిక సుంకాలు విధిస్తూ, బెదిరింపులకు పాల్పడడం మాత్రమే కాక వీసాలపై పలు కఠిన నియమాలను తీసుకొస్తున్నారు. విదేశీయులను బలవంతంగా వెనక్కిపంపుతున్నారు. దీంతో ట్రంప్ విధానాలపై అనేకులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆ వేదన ఎంతలా అంటే ఏకంగా ట్రంప్ ను హతమార్చాలి అని కోరుకునేంతగా ఉంది. అమెరికాలో ఓ దుండగుడు పిల్లలపై కాల్పులు జరిపి, ఆపై తతను తాను కాల్చుకుని చనిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముగ్గురిపై కాల్పులు
మినియాపోలిస్ లో కాథలిక్ స్కూల్ లో కాల్పులు (Shooting at Catholic school) జరిగాయి. ఇందులో ముగ్గురు చనిపోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఉన్నాడు. దుండగుడు చర్చి వెనుక నుంచి కాల్పులు చేశాడు. ఇందులో 8,10 ఏళ్లు గల ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. దుండగుడు కాల్పులు జరిపిన తర్వాత తనను తాను కాల్పులు జరుపుకుని మరణించాడు.
లింగమార్పిడి చేసుకున్న దుండగుడు
కాగా కాల్పులు జరిపిన వ్యక్తి 22 ఏళ్ల థాబబిన్ వెస్ట్రన్ గా గుర్తించారు పోలీసులు. 2020లో పురుషుడి నుంచి మహిళగా లింగమార్పిడి (Male to female gender reassignment)చేసుకుని..పేరు కూడా రాబర్ట్ నుంచి రాబిన్ గా మార్చుకున్నాడు. ఇతని దగ్గర ఒక రైఫిల్ తోపాటూ షాట్ గన్, పిస్టల్ కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దుండగుడు వాడిన ఆయుధాలపై ట్రంప్ ను చంపేయండి. న్యూక్ ఇండియా, ఇజ్రాయెల్ మస్ట్ ఫాల్, బర్న్ ఇజ్రయెల్, వేర్ ఈజ్ గాడ్, ఫర్ ది చిల్డ్రన్ అనే రాతలు కనిపించాయి. వీటిని చూసి అధికారులు షాక్ గురయ్యారు. కాల్పుల ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
కాల్పులకు ముందే యూట్యూబ్ లో పోస్ట్ ?
మరోవైపు కాల్పులకు ముందే దీనికి సంబంధించి యూట్యూబ్లో పోస్ట్ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తుపాకులు, మ్యాగజైన్లు, మేనిఫేస్ట్లు చూపించే 11 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. రాబిన్కు ఇంతకు ముందు నేరచరిత్ర
ఏమీ లేదని.. ఇప్పుడు కూడా ఒంటరిగానే ఈ కాల్పులకు పాల్పడ్డాడని అధికారులు పేర్కొన్నారు. మానసిక అనారోగ్యం కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: