हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: Cats: అడవి పిల్లులపై యుద్దం ప్రకటించిన న్యూజిలాండ్

Aanusha
Latest News: Cats: అడవి పిల్లులపై యుద్దం ప్రకటించిన న్యూజిలాండ్

స్వదేశీ వన్యప్రాణులను రక్షించుకోవడానికి న్యూజిలాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అడవి పిల్లుల (Cats) పై న్యూజిలాండ్ యుద్దం ప్రకటించింది. 2050 నాటికి దేశవ్యాప్తంగా అడవి పిల్లులను (ఫెరల్ క్యాట్స్) పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కన్జర్వేటివ్ మంత్రి తమా పోటాకా ఫెరల్ పిల్లులను ‘నిర్దయ హంతకులు’ అని వ్యాఖ్యానించారు.

Read Also: Sundar Pichai: జెమిని 3 వెనుక కష్టాలు

వీటిని ప్రెడేటర్ ఫ్రీ 2050 జాబితాలో చేర్చనున్నట్లు ధ్రువీకరించారు. 2016లో ప్రారంభమైన ఈ కార్యక్రమం, పక్షులు, గబ్బిలాలు బల్లులు, పురుగులు వంటి స్థానిక వన్యప్రాణాలకు ముప్పు కలిగించే జాతులను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుందని అంతర్జాతీయ మీడియా సీఎన్ఎస్ నివేదించింది.ఈ అడవి పిల్లులు (Cats) స్థానిక జాతులను వేటాడి చంపుతున్నాయి.

ఉదాహరణకు, స్టూవర్ట్ ద్వీపంలోని (సదరన్ డాటెరెల్) పక్షి దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. వారం వ్యవధిలోనే ఓహాకునే సమీపంలో 100కు పైగా షార్ట్-టైల్డ్ గబ్బిలాలను అడవి పిల్లులు చంపాయని పోటకా తెలిపారు.న్యూజిలాండ్ అడవులు, ద్వీపాలలో 2.5 మిలియన్లకు పైగా అడవి పిల్లులు ఉన్నాయి.

స్థానిక పక్షులపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయి

ఒక మీటర్ పొడవు (తోకతో సహా) వరకు పెరిగే వీటి బరువు 7 కిలోల వరకు ఉంటుంది. ‘‘అడవి పిల్లులు ఇప్పుడు న్యూజిలాండ్‌ వ్యాప్తంగా పొలాలు, అడవుల్లోనూ కనిపిస్తాయి. ఇవి స్థానిక పక్షులు, గబ్బిలాలు, బల్లులు, కీటకాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయి’ అని పోటకా చెప్పారు. వేటాడటంతో పాటు, అడవి పిల్లులు టాక్సోప్లాస్మోసిస్ అనే వ్యాధికి కారణమవుతాయి.

New Zealand declares war on feral cats
New Zealand declares war on feral cats

ఇది డాల్ఫిన్లకు హాని కలిగిస్తుంది. మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పశువులకు సోకి రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ‘న్యూజిలాండ్ లో చాలా మంది పిల్లులను ప్రేమిస్తారు. పెంపుడు పిల్లులు ఈ ‘ప్రెడేటర్ ఫ్రీ’ లక్ష్యంలో భాగం కావు’ అని పోటకా స్పష్టం చేశారు.

మాంసం ఎర

‘‘మొట్టమొదటిసారిగా, ఓ వేటాడే జంతువును ఈ జాబితాలో చేర్చుతున్నారు. ఇది ఇతర క్షీరదాలతో పాటు ఉంటుంది’ అని ఆయన అన్నారు. అడవి పిల్లులను నిర్మూలించడం వల్ల జీవవైవిధ్యం పెరుగుతుందని, వారసత్వ ప్రకృతి దృశ్యాలు పరిరక్షింపబడి న్యూజిలాండ్ పర్యావరణ గుర్తింపును కాపాడవచ్చు’’ ఆయన తెలిపారు. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ (DOC) అడవి పిల్లులను నియంత్రించడానికి మాంసం ఆధారిత ఎరను ఉపయోగించే కొత్త పద్ధతిని పరీక్షిస్తోంది. మొదట, పిల్లులను ఆకర్షించడానికి హానిచేయని ఎరను ఉపయోగిస్తారు. ఆ తర్వాత, ఇతర తెగుళ్ల నివారణకు ఉపయోగించే 1080 అనే రసాయనంతో కూడిన విషపూరిత ఎరను ఉపయోగిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870