New York: అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. రేపు మంగళవారం న్యూయార్క్ మేయర్, ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా జొహ్రన్ మద్దని పోటీలో ఉన్నారు. ఇంతకీ ఈయన ఎవరు? జొహ్రాన్ (Zohran Mamdani) తల్లిదండ్రుల మూలాలు భారత్ లో ఉన్నాయి. ఈయన తల్లి మీరా నాయర్, సినిమా డైరక్టర్. తండ్రి మహమూద్. ఈయన పుట్టింది బొంబాయిలోనే అయినా పెరిగింది మాత్రం ఉగాండాలో. పలు వాగ్దానాలు చేస్తున్న జొహ్రాన్ తాను గెలిస్తే ఇంటి అద్దెలను తగ్గిస్తానని, పిల్లల సంరక్షణను, మెట్రో బస్సుల్లో ఉచిన ప్రయాణాన్ని కల్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు. అంతేకాక నగరంలో ప్రభుత్వమే నిర్వహించే కూరగాయల దుకాణాలని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు.

New York: న్యూయార్క్ మేయర్ ఎన్నికలు..
New York: ఇజ్రాయెల్ వెలుపల అత్యధికంగా యూదులు నివసించేది న్యూయార్క్ లోనే. పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాక.. ఇజ్రాయెల్ పై తన కోపాన్ని కూడా ప్రదర్శించారు. యువతకు బాగా నచ్చిన జొహ్రాన్ ప్రత్యేకంగా జొహ్రాన్ అక్కడి యువతరానికి బాగా నచ్చారు. అతను ముస్లిం అనీ, జీహాది అని, అతను గెలిస్తే యూదులకు భద్రత ఉండదనీ ప్రత్యర్థులు ఎంతలా ప్రచారం చేసినా.. మత, జాతి తారతమ్యాలు లేకుండా యువత అతనికి మద్దతుగా పోటెత్తింది. అతనికి మద్దతుగా వేలమంది వాలంటీర్లు న్యూయార్క్ వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ ను నేరుగా ఢీకొనే నాయకుడిగా జొహ్రాన్ ని చూస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: