White House shooting : వైట్ హౌస్‌కు కొద్ది దూరంలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యురాలు సారా బెక్‌స్ట్రమ్ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఘటన దేశాన్ని కలచివేసిందని అన్నారు.
“సారా బెక్‌స్ట్రమ్ అత్యంత గౌరవనీయురాలు, యువతి, అసాధారణ వ్యక్తి. (White House shooting) ఆమె ఇప్పుడు మన మధ్య లేరు,” అని ట్రంప్ పేర్కొన్నారు. మరో గాయపడిన నేషనల్ గార్డ్ సభ్యుడు తీవ్ర పరిస్థితిలో ఉన్నాడని, ప్రాణాల కోసం పోరాడుతున్నాడని తెలిపారు. అతని ఆరోగ్యం మెరుగుపడాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ అన్నారు.
Latest News: TG GP Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది
వెస్ట్ వర్జీనియా గవర్నర్ ప్యాట్రిక్ మోరిసీ కూడా సారా మరణాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. రాష్ట్రం, దేశం కోసం ధైర్యంగా సేవలందించిన జవాన్‌గా సారాను ఆయన అభివర్ణించారు.
కాల్పుల వివరాలు
సారా బెక్‌స్ట్రమ్ (20), ఆండ్రూ వోల్ఫ్ (24) నవంబర్ 26న థ్యాంక్స్‌గివింగ్‌కు ముందు రోజు వైట్ హౌస్‌కు సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వారి మీద కాల్పులు జరిపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో లేరు.
దుండగుడు కూడా తీవ్ర స్థితిలో
ఈ దాడి చేసిన అనుమానితుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు ట్రంప్ తెలిపారు. అతడిని “మానవత్వం లేని వ్యక్తి”గా అభివర్ణించిన ఆయన, అతడి పరిస్థితి కూడా సీరియస్‌మని అన్నారు.
దాడి చేసిన వ్యక్తి 29 ఏళ్ల రహ్మానుల్లా లకాన్వాల్ అనే అఫ్గాన్ జాతీయుడిగా గుర్తించారు. అతడు 2021లో బైడెన్ పాలనలో ‘ఆపరేషన్ అలైస్ వెల్‌కమ్’ ద్వారా అమెరికా వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ఉగ్రవాద ఆరోపణలు నమోదు చేసే అవకాశముందని తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :