టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నాలుగో టెస్ట్‌లో టీమిండియా (Team India) జట్టు వెనుకబడేందుకు గిల్ కారణమని, అతని వ్యూహాత్మక లోపాలు మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మలచలేకపోయాయని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటపై విశ్లేషణ చేస్తూ, ది డెయిలీ మెయిల్ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన గిల్ నాయకత్వాన్ని నిశితంగా విమర్శించాడు.హుస్సేన్ ప్రకారం, గిల్ మూడో రోజు ఆటలో కీలకమైన వ్యూహాత్మక తప్పిదాలు చేశాడని, ప్రధాన బౌలర్లను సమయానికి సరైన విధంగా ఉపయోగించలేకపోయాడని పేర్కొన్నారు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) లను సరైన ఎండ్‌ల నుంచి బౌలింగ్ చేయనివ్వకపోవడం భారత్‌కి నష్టాన్ని కలిగించిందని అన్నారు. “బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీసిన ఎండ్ నుంచి బౌలింగ్ చేయడం వల్లే అతనికి ఎక్కువ సహకారం లభించింది.

నేను ఇంత వరకు సుందర్‌లాంటి బౌలర్‌ను చూడలేదు
కానీ బుమ్రా మాత్రం దానికంటే తక్కువ సహకారం లభించే ఎండ్ నుంచి ఎక్కువగా బౌలింగ్ చేశాడు,” అని హుస్సేన్ (Nasser Hussein) చెప్పారు.69వ ఓవర్ వరకు అతనికి బంతినివ్వలేదు. దాంతో ఇంగ్లండ్ భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. సుందర్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది. లార్డ్స్ టెస్ట్‌లో నాలుగు వికెట్లు తీసి విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో అన్న సుందర్‌పై నమ్మకం ఉంచలేదు. నేను ఇంత వరకు సుందర్‌లాంటి బౌలర్‌ను చూడలేదు. అతను ఇంగ్లండ్ కండిషన్స్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గాలికి వ్యతిరేకంగా టర్న్ రాబడుతున్నాడు.బంతి అందుకోగానే అతను ప్రభావం చూపాడు. ఓలీ పోప్, హ్యారీ బ్రూక్‌లను వెనువెంటనే పెవిలియన్ చేర్చాడు. కానీ అతనితో ఆలస్యంగా బౌలింగ్ చేయించి గిల్ మూల్యం చెల్లించుకున్నాడు.’అని నాజర్ హుస్సేన్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.
శుభ్‌మన్ గిల్ స్నేహితుడు ఎవరు?
శుభ్‌మన్ గిల్‌కు అత్యంత సన్నిహిత స్నేహితుడు అభిషేక్ శర్మ. వీరిద్దరూ చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు.
శుభ్‌మన్ గిల్ హిందూ మతాన్ని అనుసరిస్తాడా?
కాదు, శుభ్‌మన్ గిల్ హిందూ మతానికి చెందడు. అతడు పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా, చక్ జైమల్ సింగ్ వాలా అనే గ్రామంలో పుట్టిన పంజాబీ సిక్కు కుటుంబానికి చెందినవాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Morne Morkel: కుల్దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడానికి గల కారణాన్ని తెలిపిన మోర్నీ మోర్కెల్