దక్షిణ అమెరికా దేశమైనా వెనిజులాపై శనివారం అమెరికా దాడి చేసిన విషయం అందిరికీ తెలిసిందే.. ఈ దాడి తర్వాత, వెనిజులా అద్యక్షుడైన నికొలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో, ప్రజలకు నిరంతరాయంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు నెల రోజుల పాటు స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం ప్రకటించారు.
Read also: Maria Corina Machado: ‘స్వేచ్ఛా గడియలు’ మొదలయ్యాయి
స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉచితం
వెనిజులా ప్రజలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో వెల్లడించారు. అమెరికా సైనిక చర్యలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడిన కొద్దిసేపటికే మస్క్ (Elon Musk) ఈ ప్రకటన చేయడం గమనార్హం. మదురో అరెస్ట్‌ను స్వాగతించిన మస్క్, ఆయన పాలన ముగియడంతో ఇకనైనా వెనిజులా అభివృద్ధి పథంలో పయనించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. “వెనిజులా ఇప్పుడు శ్రేయస్సును పొందగలదు” అని స్పానిష్ భాషలో వ్యాఖ్యానించారు.
లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా పనిచేసే స్టార్‌లింక్ నెట్‌వర్క్, దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో కనెక్టివిటీ సమస్యలు లేకుండా చూస్తుంది.ఫిబ్రవరి 3 వరకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. 2024 ఎన్నికల సమయంలో ప్రతిపక్షానికి బహిరంగంగా మద్దతు పలికిన మస్క్ (Elon Musk) , నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోకు అండగా నిలిచారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న వెనిజులా, సరైన నాయకత్వం లేకపోవడం వల్లే అభివృద్ధికి దూరమైందని మస్క్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: