టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అమెరికా ప్రభుత్వం ఏర్పాటుచేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్ –Department of Government Efficiency) చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ (X) ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ సేవల వ్యవధి ముగిసిందని, తాను ఈ పదవిని విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మస్క్ కృతజ్ఞతలు
తన ప్రభుత్వ సేవలకు అవకాశం కల్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ విభాగంలో తాను పనిచేయడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. తన పదవీకాలంలో పలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టామనీ, అవి ప్రభుత్వ ఖర్చులపై స్పష్టమైన ప్రభావం చూపాయని తెలిపారు. భవిష్యత్తులో డోజ్ విభాగం మరింత బలోపేతంగా పనిచేస్తుందన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు.
ట్రంప్ పాలనలో ఏర్పాటైన డోజ్ విభాగం
డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత, ప్రభుత్వ వ్యవస్థను సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల్లోని అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఈ విభాగం ఏర్పాటైంది. ఎలాన్ మస్క్‌ను ఈ విభాగానికి చైర్మన్‌గా నియమించటం ద్వారా ప్రజా నిధుల వినియోగంలో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసింది. మస్క్ నేతృత్వంలో ఈ విభాగం ప్రభుత్వ విధానాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో పాత్ర వహించింది.
Read Also : Post Office : పోస్టల్ సర్వీసుల్లో రెండు కొత్త డిజిటల్ సేవలు..