हिन्दी | Epaper

Trump deal with Mukesh: ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

Vanipushpa
Trump deal with Mukesh: ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump). 300 బిలియన్ డాలర్ల చమురు శుద్ధి కర్మాగార ప్రాజెక్టును టెక్సాస్‌లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భారతదేశ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామిగా ఉంది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఈ ప్రాజెక్టును అమెరికా చరిత్రలో అతిపెద్ద ఒప్పందంగా పేర్కొన్నారు. ఇది అమెరికన్ కార్మికులు, ఇంధన వృద్ధి, దక్షిణ టెక్సాస్ ప్రజలకు భారీ విజయం అని అభివర్ణించారు. ట్రంప్ ప్రకటన ప్రకారం.. ఈ ప్రాజెక్టు దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి, పారిశ్రామిక పెట్టుబడులను విస్తరించడానికి ఓ ముఖ్యమైన ఒక దశగా ఉంటుంది. బ్రౌన్స్‌విల్లే నౌకాశ్రయంలో ఉనికిలో ఉండే అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ ఈ రిఫైనరీను అభివృద్ధి చేస్తుంది. ట్రంప్ ఈ ప్రాజెక్టును ఆర్థిక, వ్యూహాత్మక మైలురాయిగా పేర్కొన్నారు. అయితే, పెట్టుబడి నిర్మాణం, ఖర్చులు లేదా ఆర్థిక వివరాలపై ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు.

Read Also: Switzerland Bus Fire Accident: ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం

Trump's huge deal with Mukesh Ambani..
Trump’s huge deal with Mukesh Ambani..

బిలియన్ డాలర్ల ఒప్పందాలు

ముఖేష్ అంబానీ(Mukesh Ambani) నేతృత్వంలోని భారతీయ అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థను ప్రత్యేకంగా పోస్టులో ప్రశంసించారు.భారతదేశంలోని మా భాగస్వాములు, రిలయన్స్‌కు ధన్యవాదాలని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే అమెరికా ఫస్ట్ అజెండా క్రింద.. పర్మిట్లను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్ల బిలియన్ డాలర్ల ఒప్పందాలు సాధ్యమయ్యాయని ట్రంప్ వివరించారు. టెక్సాస్‌లో కొత్త శుద్ధి కర్మాగారం ద్వారా యుఎస్ మార్కెట్లకు ఇంధన సరఫరా పెరుగుతుంది. జాతీయ భద్రత బలోపేతం అవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన రిఫైనరీగా నిలుస్తుంది. దీని ద్వారా వేలాది ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ ఎగుమతులకు శక్తి కల్పిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనకు నేపథ్యంగా.. ఇంధన ధరల పెరుగుదల, ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి అంతర్జాతీయ పరిస్థితులు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం, వినియోగదారుల ధరలను స్థిరంగా ఉంచడానికి, కీలక వాణిజ్య ట్యాంకర్లకు సైనిక రక్షణ, ఎమర్జెన్సీ రిజర్వులు విడుదల వంటి చర్యలను పరిశీలిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు కన్నుమూత

కోస్తాంధ్రలో నేడు, రేపు వర్షాలు

కోస్తాంధ్రలో నేడు, రేపు వర్షాలు

ఏపీ నెంబర్ వన్ పర్యాటక రంగంగా అభివృద్ధి

ఏపీ నెంబర్ వన్ పర్యాటక రంగంగా అభివృద్ధి

హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
0:51

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

పాల కల్తీని గుర్తించాలంటే..

పాల కల్తీని గుర్తించాలంటే..

📢 For Advertisement Booking: 98481 12870