ఇటీవల అమెరికా, చైనా(America/China) మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. అమెరికా నుంచి చైనా వెళ్లాల్సిన ఎథేన్ గ్యాస్ ట్యాంకర్, అనూహ్యంగా భారతదేశానికి మళ్లింపబడుతుంది. అదీ మన దేశంలో పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries)కు వస్తుంది. అసలు ఈ ఎథేన్ చమురు, చైనా లోని పెట్రోకెమికల్ పరిశ్రమల కోసం కావాల్సింది ఈ చమురు. కానీ ఇటీవల అమెరికా ప్రభుత్వం చైనా మీద ఎథేన్ ఎగుమతులకు కొన్ని నియంత్రణలు విధించడంతో, ఆ ట్యాంకర్ ఇటు ఇండియా కి మారింది. చైనా బదులు, ఇండియా(India)లోని గుజరాత్(Gujarath) రాష్ట్రంలో ఉన్న దహెజ్ వద్ద ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇది చేరింది. ఇది ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎథేన్ దిగుమతిదారుల్లో ఒకటిగా రిలయన్స్‌ని మరొకసారి గుర్తించేలా చేసింది.

భారత్ తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర
రిలయన్స్ ఇప్పటికే అమెరికా నుంచి ఎథేన్‌ను దిగుమతి చేసుకునే ప్రత్యేక షిప్పింగ్ వ్యవస్థను స్థాపించి, దాన్ని తన మూడు పెట్రోకెమికల్ ప్లాంట్ల (దహెజ్, హజిరా, నాగోఠణే)కి సరఫరా చేస్తూ ఉంది. ఈ మార్పుతో పాటు కంపెనీకి మరింత సరళంగా, తక్కువ ఖర్చుతో ముడి పదార్థాలు అందుబాటులోకి తీసుకు వస్తాయి. అమెరికా-చైనా మధ్య అభివృద్ధి చెందిన ఈ ఉద్రిక్తత మన దేశ పరిశ్రమలకు పరోక్షంగా మేలే చేసింది. ఎథేన్ ఒక కీలక ఫీడ్‌స్టాక్ (feedstock), ముఖ్యంగా ప్లాస్టిక్, కెమికల్స్, సింథటిక్ ఫైబర్స్ తయారీకి ఉపయోగపడుతుంది. దీని లభ్యత పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తి వ్యయాలు తగ్గి, స్థానికంగా తయారయ్యే వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయి. దీని వల్ల ఎగుమతులపై ఆధారపడే ఇండస్ట్రీలకు పోటీ సామర్థ్యం పెరుగుతుంది. అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న $43 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్‌ను తగ్గించేందుకు, భారత్‌తో గ్యాస్ వ్యాపారం జరిపే దిశగా దృష్టి పెడుతోంది.
ఒప్పందంలో భాగంగా..
ఈ నేపథ్యంలో, భారత్ తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర పోషిస్తోంది. జూలై 9 నాటికి అమల్లోకి రానున్న 26% పరస్పర టారిఫ్‌లకు ముందు, అమెరికా-భారత్ మధ్య గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని వేగంగా కుదుర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వ్యూహాత్మక చలనం చోటు చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, చైనా బదులు భారతదేశంలోని దహెజ్‌లో ఉన్న రిలయన్స్ ప్లాంట్‌కి ఎథేన్ సరఫరా మారడం ద్వారా, అమెరికా తాత్కాలికంగా తన ఎగుమతుల ఆదాయాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇది ఒకవైపు అమెరికా ట్రేడ్ గ్యాప్‌ను తగ్గించడంలో తోడ్పడుతుండగా, మరోవైపు భారత్‌కు కీలకమైన ఎనర్జీ సోర్స్‌ను సమయానికి అందుబాటులోకి తెస్తోంది. ఎథేన్ అనేది వేరే ఇంధనంతో పోల్చితే ఇది ఒక క్లీనర్ హైడ్రోకార్బన్. దేశీయంగా పెట్రోకెమికల్స్ తయారీలో దీన్ని ఉపయోగించడం వలన కాలుష్యం కొంతమేర తగ్గించే అవకాశముంది. రిలయన్స్ వంటి సంస్థలు ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ మార్గంలో అడుగులు వేస్తుండడంతో, ఇది సరైన దిశగా మరో పటిష్టమైన అడుగు అవుతుంది.
ఈ ఘటన మనకు ఒక పెద్ద విషయాన్ని గుర్తు చేస్తోంది. అంతర్జాతీయ రాజకీయాలు, వ్యాపార ఒప్పందాలు ఒక్కసారి మారితే, ప్రపంచ ఎకానమీలోని చక్రాలు ఎటు తిరుగుతాయో ఊహించలేం. కానీ అలాంటి పరిస్థితుల్లో మనదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఓ విధంగా ఇది ఒక అవకాశంగా మారుతుంది. రిలయన్స్‌కి ఇది కేవలం ఓ డీలే కాదు ఇది ఇండియన్ ఎనర్జీ రంగం కోసం తెరచిన మరో గేటే .
1 గంట అంబానీ జీతం ఎంత?
ముకేష్ అంబానీ నికర విలువ 2024: జీతం, రూపాయలలో నికర విలువ ...
ముకేష్ అంబానీ ఆదాయం మారుతూ ఉంటుంది, కానీ COVID-19 మహమ్మారి సమయంలో, జాగ్రన్ జోష్ మరియు ఇండియా టుడే ప్రకారం, అతను గంటకు ₹90 కోట్లు సంపాదిస్తున్నట్లు నివేదించబడింది. సగటు భారతీయుడి సంపాదనతో పోల్చినప్పుడు కూడా ఇది గణనీయమైన మొత్తానికి అనువదిస్తుంది. అతని అధికారిక జీతం పరిమితం చేయబడినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అతని వాటాల ద్వారా అతని సంపద గణనీయంగా పెరుగుతుంది.
అంబానీ విజయ గాథ ఏమిటి?
ముకేష్ అంబానీ విజయ గాథ రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధితో లోతుగా ముడిపడి ఉంది, అతని తండ్రి ధీరూభాయ్ అంబానీ వ్యవస్థాపక దృక్పథం నుండి ప్రారంభమై ప్రపంచ సమ్మేళనంగా పరిణామం చెందింది. ధీరూభాయ్ అంబానీ రిలయన్స్‌ను స్థాపించడం ద్వారా పునాది వేశారు, మొదట్లో వస్త్రాలపై దృష్టి సారించి, తరువాత పెట్రోకెమికల్స్, శుద్ధి మరియు ఇతర రంగాలలోకి విస్తరించారు. ఈ విస్తరణలో, ముఖ్యంగా జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడంలో ముఖేష్ అంబానీ కీలక పాత్ర పోషించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Electric vehicles: విద్యుత్ వాహనాల విక్రయాలు జంప్