हिन्दी | Epaper

Bangladesh: రాజకీయాలకు గుడ్ బై.. సామాజిక వ్యాపారాలపై యూనస్ దృష్టి?

Vanipushpa
Bangladesh: రాజకీయాలకు గుడ్ బై.. సామాజిక వ్యాపారాలపై యూనస్ దృష్టి?

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకోనుంది. గత 18 నెలలుగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయం సాధించడంతో, ఫిబ్రవరి 17న (రాబోయే మంగళవారం) తారిఖ్ రెహ్మాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో యూనస్ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు దేశ అధ్యక్ష పదవి లేదా ఏదైనా కీలక రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది.

AP: ఏపీకి వస్తున్న బిల్ గేట్స్..చంద్రబాబుతో భేటీ

Bangladesh: రాజకీయాలకు గుడ్ బై.. సామాజిక వ్యాపారాలపై యూనస్ దృష్టి?
Bangladesh: రాజకీయాలకు గుడ్ బై.. సామాజిక వ్యాపారాలపై యూనస్ దృష్టి?

రాజకీయాల పట్ల యూనస్‌కు ఆసక్తి లేదు

ముఖ్యంగా తారిఖ్ రెహ్మాన్ ప్రతిభావంతులను, మేధావులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని భావిస్తుండటంతో, యూనస్ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. యూనస్‌కు ఉన్న అంతర్జాతీయ పరపతి దేశానికి మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం మాత్రం ఈ వార్తలను ఖండించారు. యూనస్‌కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, తన పదవీకాలం ముగిశాక తిరిగి తన పాత వృత్తిలోకి వెళ్లి పేదరిక నిర్మూలన, సామాజిక వ్యాపారాలపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. యూనస్ తన లక్ష్యాలను చేరుకున్నానని, శాంతియుతంగా అధికారాన్ని కొత్త ప్రభుత్వానికి అప్పగించడమే తన ప్రధాన బాధ్యతని భావిస్తున్నారు. ఏదేమైనా, ఒక సంక్లిష్ట సమయంలో దేశాన్ని నడిపించిన యూనస్, అధికారిక పదవిలో ఉంటారా లేక ఒక మార్గదర్శిగా తన సేవలు అందిస్తారా అనేది త్వరలోనే తేలనుంది. 1940లో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జన్మించారు. ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం తర్వాత, అమెరికాలోని వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. తొలుత అమెరికాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

📢 For Advertisement Booking: 98481 12870