ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అస్థిరత, అశాంతి నెలకొంది. దాదాపు ప్రతి దేశం.. తమ సరిహద్దు దేశాలతో వైరం పెంచుకుంటోంది. ఉక్రెయిన్- రష్యా దగ్గర్నుంచి ఇజ్రాయెల్- పాలస్తీనా, భారత్- పాకిస్థాన్, చైనా- తైవాన్, చైనా- భారత్, పాకిస్థాన్- అఫ్గానిస్తాన్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేశాల్లో ప్రస్తుతం అస్థిరత, అశాంతి నెలకున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరు..? వాళ్లు ఏం చేస్తారు..? అని తెలుసుకోవడానికి అందరూ పరితపిస్తారు.
Read Also: ODI series: వన్డే సిరీస్.. గాయం కారణంగా ఆల్‌రౌండర్ కేమరూన్ ఔట్
తొలి స్థానంలో జిన్ పింగ్, రెండోస్థానంలో ట్రంప్
ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులను అధికారం, ప్రభావం, కంట్రోల్ ఈ మూడు శక్తులు ప్రభావితం చేస్తాయి. వాళ్లు ప్రపంచాన్ని మార్చగలరు. ఇక్కడ డబ్బు ప్రాముఖ్యం కాదు.. ఎవరైతే తమ నిర్ణయాలతో ప్రపంచ దేశాల్ని ప్రభావితం చేస్తారో.. కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపిస్తారో.. సరిహద్దుల్ని మార్చడం చేస్తారో వారే ఇక్కడ శక్తివంతమైన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఇందులో రాజకీయ నాయకుల నుంచి టెక్ దిగ్గజాల వరకు అందరూ ఉన్నారు. ఇక ఈ లిస్టులో తొలి స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉన్నారు. ఆయన చెైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడిగా.. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్మీ లో ఒకటైనా చైనా సైన్యం అధినేతగా జిన్ పింగ్ (Jinping)ఉన్నారు. అతడి పాలసీలు చైనానే కాకుండా ప్రపంచ దేశాల్ని ప్రభావితం చేస్తాయి. ఇక రెండోస్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఉన్నారు. అతిపెద్ద ఎకానమీగా అమెరికా ఉంది. అమెరికన్ కరెన్సీ ప్రపంచ దేశాల్ని శాసిస్తోంది. అలాగే పలు కారణాల వల్ల కూడా ట్రంప్ రెండో శక్తివంతమైన నేతగా ఉన్నారు.

మూడో స్థానంలో ఎలాన్ మస్క్
మూడో స్థానంలో టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారు. స్పేస్ ట్రావెలింగ్ నుంచి ఏఐ వరకు ఆయన సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలోనే కుబేరుడిగా మస్క్ ఉన్నారు. 2025 నాటికి ఆయన ఆస్తుల విలువ 330 బిలియన్ డాలర్లుగా ఉంది. బిజినెల్ ప్రపంచంలో మస్క్ ఒక తిరుగులేని వ్యక్తిగా ఉన్నారు. నాలుగో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Modi) ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశానికి ఆయన ప్రధానిగా ఉన్నారు. ఎకానమీ, ఆర్మీ పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉంది.
మూడో స్థానంలో జెరోమ్ పోవెల్
ఐదో స్థానంలో ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ యూనైటెడ్ స్టేట్స్ సీఈఓ జెరోమ్ పోవెల్ ఉన్నారు. ద్రవ్యల్బణం, ఎంప్లాయ్ మెంట్, కరెన్సీ అంశాల్లో ఆయనకు ప్రాముఖ్యత ఉంది. ఆరో స్థానంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు. ఏడో స్థానంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఎనిమిదో స్థానంలో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్.. తొమ్మిదో వ్యక్తిగా ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా.. పదో స్థానంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: