ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel )మధ్య కొనసాగుతున్న యుద్ధంలో తాజాగా ఇజ్రాయెల్ చేపట్టిన వ్యూహాత్మక దాడులు ప్రపంచాన్ని శర్వరి చేస్తున్నాయి. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ గూఢచార విభాగమైన మొస్సాద్ (Mossad) కీలక పాత్ర పోషించింది. గత కొన్నేళ్లుగా ఈ దాడులకు సంబంధించి వ్యూహాలను రూపొందిస్తూ, ఇరాన్ అంతర్గత ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రణాళికల ఫలితంగా ఇప్పుడు ఇరాన్ కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సమర్థవంతంగా దాడులు చేపట్టగలిగింది.
డ్రోన్ల సాయంతో ఆపరేషన్ రైజింగ్ లయన్
“ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరిట మొస్సాద్ ప్రారంభించిన ఈ గూఢచార దాడి అత్యంత రహస్యంగా ముందుకెళ్లింది. మొదట్లో ఇరాన్ లోపలికి రహస్యంగా కమాండోలను, పేలుడు పదార్థాలను చొప్పించడంతోపాటు టెహ్రాన్ సమీపంలో డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత, ఆయా స్థావరాల నుంచి నడిపిన డ్రోన్ దాడుల ద్వారా ఇరాన్‌లోని క్షిపణి నిల్వలు, అణు కేంద్రాలను ధ్వంసం చేశారు. ఈ దాడులు అత్యంత కచ్చితత్వంతో నిర్వహించబడ్డాయి.
అణు శక్తిపై ప్రభావం – భారీ నష్టం
ఈ ఆపరేషన్ ఫలితంగా ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా అణు ఆయుధాల తయారీలో కీలకంగా ఉండే కేంద్రాలు నాశనమవడంతో దేశ రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపింది. డ్రోన్ల దాడులతో తక్కువ సమయంలో పెద్ద స్థాయిలో నష్టాన్ని కలిగించగలగడం ఈ వ్యూహానికి విజయాన్ని చాటింది. ప్రస్తుతం ఇరాన్ ఈ దాడులకు బదులుగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశంపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది.
Read Also : Workers Strike : 22 నుంచి ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె