చైనాలో బయోటెక్నాలజీ రంగం విస్తరిస్తుండటంతో, వైద్య పరిశోధనల కోసం ఉపయోగించే కోతులపై డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొత్త కొత్త బయోఫార్మా ప్రాజెక్టులు, వ్యాక్సిన్ అభివృద్ధి, జన్యుపరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ సంఖ్య గణనీయంగా పెరగడంతో పరిశోధన సంస్థలకు పెద్ద సంఖ్యలో ప్రయోగ జంతువులు అవసరమవుతున్నాయి. ముఖ్యంగా మనుషుల శరీర వ్యవస్థకు దగ్గరగా ఉండే కోతులు (Monkeys) మెడికల్ రీసెర్చ్‌లో కీలక పాత్ర పోషిస్తుండటంతో, వాటి అవసరం మరింత పెరిగింది.
Read also: Trump: వెనెజులా ప్రజలతో మేం కలిసి పనిచేస్తాం

ప్రత్యేక జాతుల కోతుల ధరలు
ఈ నేపథ్యంలో చైనాలో కోతుల కొరత తీవ్ర సమస్యగా మారింది. డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకపోవడంతో ఒక్కో కోతి ధర రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల కోతుల ధరలు అంతకంటే ఎక్కువగా పలుకుతున్నాయని సమాచారం. 2025లో మరిన్ని బయో ప్రాజెక్టులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, కోతుల కొరత పరిశోధనలకు ఆటంకం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: