हिन्दी | Epaper

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం

Pooja
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీని నియమించారని ఇటీవల కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ సమాచారం నిజం కాదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్తలపై అధికారిక వర్గాలు స్పందిస్తూ, ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.

Read Also:Iran Attacks Dubai: దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మళ్లీ క్లోజ్..

Mojtaba Khamenei
Mojtaba Khamenei: Confusion over appointment of Iran’s Supreme Leader

ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో కొత్త నాయకత్వ ప్రకటనలో ఆలస్యం

ఇదిలా ఉండగా, కొత్త సుప్రీం లీడర్ నియామక ప్రక్రియలో ఇరాన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మొజ్తబా ఖమేనీ పేరు ప్రకటిస్తే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన కారణంగా ప్రభుత్వం మౌనం పాటిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టే లీడర్లను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గతంలో కూడా కీలక పదవులు చేపట్టిన కొందరు లీడర్లపై దాడులు జరగడం ఈ భయాలకు కారణమని అనలిస్టులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నాయకత్వ మార్పుపై అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870