ఒకవైపు ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) విదేశీపర్యటనపై గగ్గోలు పెడుతున్నా.. దేశీయ సమస్యలను ఏమాత్రం ఖాతరు చేయకుండా విదేశీ పర్యటనల్లో మునిగితేలుతున్నారని విమర్శిస్తున్నా మోదీ మాత్రం వీటిని ఏమీ పట్టించుకోకుండా తన పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ విదేశాలకు వెళుతున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ప్రాంతీయ సహకారం రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబరు 15 నుంచి నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో ఆయన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు.
Read Also: Australia: బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం

జోర్డాన్లో నాలుగురోజుల పర్యటనతో ఆరంభం..
ప్రధాని నరేంద్రమోదీ జోర్డాన్ పర్యటనతో రెండురోజుల పర్యటనను ఆరంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజు అబ్దుల్లా-2తో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో భారత్-జోర్డాన్ సంబంధాల మొత్తం పరిధిపై సమీ జరగనుండగా, మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పరస్పర వృద్ధి, ఆర్థిక సహకారం, వ్యాపార సంబంధాల విస్తరణతో పాటు ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో భారత్ నిబద్ధతనుఇ ది మరోసారి స్పష్టం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
16వ తేదీన ఇథియోపియకు చేరుకుంటారు..
ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ఇథియోపియాకు చేరుకుంటారు. అక్కడ రెండురోజుల ఆటు బస చేయనున్నారు. వమోదీకి ఇథియోపియా పర్యటన మొదటిసారి కావడం విశేషం. ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ఆయన విస్తృతస్థాయి చర్చలు జరుపుతారు. గ్లోబల్ సౌత్లో కీలక భాగస్వాములుగా భారత్-ఇథియోపియా దేశాలు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో, ఈ పర్యటన రెండు దేశాలమధ్య స్నేహసంబంధాలను మరింత బలపరచే కీలక అవకాశం ఉంది.
ఒమన్ లో పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోదీ
ప్రధాని నరేంద్రమోదీ తన చివరి పర్యటనలో భాగంగా ఒమన్ సుల్తానేట్ ను సందర్శిస్తారు. ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన ప్రధాని మోదీకి ఒమన్ లో రెండోసారి పర్యటించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, భద్రత, సాంకేతికత, వ్యవసాయం వంటిఅంశాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించనున్నారు. ఏదిఏమైనా ప్రధాని నరేంద్రమోదీ తన విదేశీపర్యటన వల్ల ప్రపంచదేశాలకు భారత్ సత్తాను చాటుచెబుతున్నారు. ఇతర దేశాలతో భారత్ (India) పోటీపడుతూ, అభివృద్ధివైపుకు దూసుకునిపోయేలా తనవంతు కృషిని చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా స్వదేశీ సమస్యలపై కూడా ప్రధాని నరేంద్రమోదీ సమగ్ర దృష్టిని కేంద్రీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: