ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ(Modi) క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాకుండా, యువతకు క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తిని నేర్పే సాధనమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం క్రీడాకారుల కోసం స్టేడియంలు, స్పోర్ట్స్ అకాడమీలు, శిక్షణ కేంద్రాల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.
Read Also: David Warner: బిగ్ బాష్ లీగ్ లో వార్నర్ భారీ శతకం

గ్రాస్‌రూట్ స్థాయిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా వంటి పథకాలు(Modi) కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత అథ్లెట్లు పతకాలు సాధిస్తూ దేశానికి గౌరవం తీసుకొస్తున్నారని ప్రశంసించారు.
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో దేశంలో క్రీడా సంస్కృతి మరింత బలోపేతం అవుతుందని, యువతకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రపంచానికి భారత్ సామర్థ్యాన్ని చాటిచెప్పే గొప్ప అవకాశంగా ఇది మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: