ఈ రోజు రాత్రి ఆకాశం ప్రేమికులకు, ఖగోళ శాస్త్రాభిమానులకు అద్భుతమైన విందు కాబోతోంది. ఎందుకంటే ఈ రాత్రి ‘బీవర్ సూపర్ మూన్’ (Beaver Super Moon 2025) అనే అరుదైన సంఘటన జరగనుంది. చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత దగ్గరగా చేరబోతున్నాడు. దీని వలన ఈ రోజు చంద్రుడు సాధారణంగా కనిపించే పరిమాణం కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.
Read Also: IBM: ఉద్యోగులకు ఐబిఎమ్ భారీ లేఆఫ్స్ కు సిద్ధం?
ఈ అద్భుత దృశ్యం మన దేశంలో రాత్రి 6.49 గంటలకు పూర్ణచంద్రునిగా దర్శనమిస్తుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే — ఈ సూపర్ మూన్‌ను చూడటానికి ఎలాంటి టెలిస్కోప్ (telescope) లేదా ప్రత్యేక పరికరాల అవసరం లేదు.
సూపర్ మూన్ అంటే ఏమిటి?
సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ ఓ ఎలిప్టికల్ కక్ష్యలో తిరుగుతాడు. ఈ కక్ష్యలో ఒక దశలో చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వస్తాడు — దీనిని “పెరిజీ” (Perigee) అంటారు. చంద్రుడు ఈ దశలో పూర్ణచంద్రుడిగా మారితే, దానినే సూపర్ మూన్ (Beaver Super Moon 2025) అంటారు. ఆ సమయంలో చంద్రుడు సాధారణ పూర్ణచంద్రుడి కంటే కొంచెం పెద్దగా, కాంతివంతంగా కనబడతాడు.
‘బీవర్ సూపర్ మూన్’ పేరు ఎలా వచ్చింది?
ప్రాచీన ఉత్తర అమెరికా సంస్కృతిలో నవంబర్ నెలలో బీవర్ జంతువులు (Beavers are animals) తమ గూళ్లను నిర్మించుకునే సమయం ఉంటుంది. అందుకే నవంబర్ నెలలో వచ్చే సూపర్ మూన్‌ను “బీవర్ మూన్” అని పిలుస్తారు. ఈ సూపర్ మూన్ సీజన్ మార్పును సూచించే చిహ్నంగా కూడా భావిస్తారు.

ఈ రోజు రాత్రి దృశ్యం ఎలా ఉంటుంది?
చంద్రుడు భూమికి సుమారు 3,56,000 కిలోమీటర్ల దూరంలో ఉండబోతున్నాడు. సాధారణంగా చంద్రుడు భూమికి సగటున 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చంద్రుడు పెద్దగా, తెల్లగా కనిపించి, రాత్రి ఆకాశాన్ని మంత్ర ముగ్ధం చేయనున్నాడు. ఈ దృశ్యాన్ని ఓపెన్ ఏరియాలో, ఎక్కువ కాంతి కాలుష్యం లేని ప్రాంతంలో చూస్తే మరింత అద్భుతంగా కనిపిస్తుంది.
ఖగోళ ప్రేమికులకు అరుదైన అవకాశం
సంవత్సరానికి 2–3 సార్లు మాత్రమే సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ రాత్రి జరగబోయే “బీవర్ సూపర్ మూన్” ఈ సంవత్సరంలోని చివరి సూపర్ మూన్ కావడంతో దీన్ని ఖచ్చితంగా మిస్ కాకూడదు. ఇది ప్రకృతిలోని అద్భుతమైన విశ్వ రహస్యాల్లో ఒకటి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: