భారత్‌పై అమెరికా భారీగా సుంకాలు (Tariffs) విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయంతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా అమెరికా బాటలోనే మరో దేశం కూడా ఇండియాకి షాకిచ్చింది. భారత్ సహా పలు దక్షిణాసియా దేశాల పై సుంకాలు(Tariffs) విధించేందుకు మెక్సికో సిద్ధమైంది.
Read Also: Pak: భారత్‌ను దెబ్బకొట్టేందుకు దక్షిణాసియాలో కొత్త శక్తి సమీకరణకు పాక్ యత్నం

భారత్, చైనా, దక్షిణ కొరియా వంటి పలు దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాల్ని పెంచే బిల్లుకు మెక్సికన్ సెనెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కనీసం 5 శాతం నుంచి 50 శాతం వరకు దిగుమతి సుంకాల్ని పెంచే బిల్లుకు మెక్సికో సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 76 మంది అనుకూలంగా, 5 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. కొత్త సుంకాలు వచ్చే ఏడాది నుంచే అమల్లోకి రానున్నాయి. దుస్తులు, లోహాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఉక్కు సహా అనేక ఉత్పత్తులపై వీటి ప్రభావం పడనుంది. ఈ నిర్ణయంతో దక్షిణాసియా దేశాలపై మోక్సికో వాణిజ్య యుద్ధం ప్రకటించినట్లైంది. ఈ సుంకాలు దేశీయ తయారీని పెంచేందుకు, ముఖ్యంగా చైనాతో పెరుగుతున్న వాణిజ్య అసమతుల్యతలను పరిష్కరించడానికి ఉద్దేశించినవిగా క్లాడియా ప్రభుత్వం చెబుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: