हिन्दी | Epaper
ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

Mexico earthquake : మెక్సికోలో భారీ భూకంపం , రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత, ప్రజల్లో భయాందోళన

Sai Kiran
Mexico earthquake : మెక్సికోలో భారీ భూకంపం , రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత, ప్రజల్లో భయాందోళన

Mexico earthquake : Mexico లో శక్తివంతమైన భూకంపం సంభవించి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాలను వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భవనాలు ఊగిపోవడంతో వణుకు వాతావరణం నెలకొంది.

జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంప కేంద్రం మెక్సికో గెరేరో రాష్ట్రంలోని Acapulco సమీపంలో గుర్తించారు. భూ ప్రకంపన కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు దక్షిణ, మధ్య మెక్సికో ప్రాంతాల్లోనూ ప్రభావం చూపినట్లు సమాచారం.

Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

తీవ్ర ప్రకంపనల కారణంగా పలుచోట్ల (Mexico earthquake) భవనాల్లో స్వల్ప పగుళ్లు ఏర్పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అకాపుల్కో, మెక్సికో సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందగా, మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి నష్టం వివరాలను అంచనా వేయడానికి అధికారులు రంగంలోకి దిగారు.

భూకంపం సంభవించిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయం అందిస్తున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా Claudia Sheinbaum విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలోనే భూకంపం రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. హెచ్చరిక సైరన్లు మోగడంతో ప్రెస్‌మీట్‌ను మధ్యలోనే నిలిపివేసి, భద్రతా సిబ్బంది అధ్యక్షురాలు సహా జర్నలిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో మళ్లీ సమావేశం కొనసాగించారు.

గతంలో 1985, 2017 సంవత్సరాల్లో వచ్చిన భారీ భూకంపాలు మెక్సికోను తీవ్రంగా నష్టపరిచిన విషయం తెలిసిందే. ఈసారి ప్రకంపన తీవ్రత తక్కువగా ఉండడంతో ప్రాణ నష్టం పరిమితంగా ఉన్నప్పటికీ, ఆస్తి నష్టం మాత్రం గణనీయంగా జరిగినట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870