Meet : చైనాలో విక్టరీ డే పరేడ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని బీజింగ్ వేదికగా జరుగుతున్న వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సైనిక ప్రదర్శనను చైనా (China) ఏర్పాటు చేసింది. ఆర్మీ బ్యాండ్ సంగీత ధ్వనుల మధ్య ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు కదం తొక్కుతున్నాయి. దక్షిణ సముద్ర తీరంలో నౌకాబలగాలు కవాతు చేపట్టాయి. వార్ ఎయిర్ క్రాప్ట్, యుద్ధ ట్యాంకులతో వందలాదిమంది సైనికులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు.
సునిశీతంగా పరిశీలిస్తున్న ట్రంప్
ఈ వేడుకలకు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో కలిసి వేదికను పంచుకున్నారు. ఒకే వేదికపై ఆసీనులయ్యారు. భారత్ సహా అన్ని దేశాల చూపును తన వైపుకు తిప్పుకుంది చైనా. ప్రత్యేకించి అమెరికా. జిన్ పింగ్, పుతిన్, కిమ్ (Xi Jinping, Putin, Kim) ఒకే వేదికపై కనిపించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జిన్ పింగ్పై ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మూడు దేశాలు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. తాను ఎంత అధిక టారిఫ్లు విధించినా ప్రపంచదేశాలు తన మాటనే వినాలని, తమ దేశానికి లొంగి ఉండాలని భావన ట్రంప్ రోజురోజుకు పెరుగుతున్నది. అందుకే నిత్యం ఇతర దేశాల పై విమర్శలు గుప్పిస్తూ, వార్తల్లో నిలుస్తున్నారు.
చైనాలో విక్టరీ డే పరేడ్ ఎందుకు నిర్వహించారు?
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా రాజధాని బీజింగ్‌లో విక్టరీ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించింది. ఆర్మీ, నౌకాబలగాలు, యుద్ధ విమానాలు, ట్యాంకులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి.
ఈ పరేడ్‌లో ప్రధాన అతిథులు ఎవరు?
ఈ వేడుకలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో వేదికను పంచుకున్నారు. ఈ త్రయం వేదికపై ఉండడం అమెరికా ఆందోళనకు కారణమైంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :