అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ (Los Angeles) నగరంలో భారీ అగ్నిప్రమాదం (Fire Breaks) సంభవించింది. లాస్ ఏంజిల్స్ (Los Angeles)అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా ఉన్న శివారు ప్రాంతమైన ఎల్ సెగుండో ప్రాంతంలో గల చెవ్రాన్ చమురు శుద్ధి కర్మాగారంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి.

కాసేపటికే మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడడ్డాయి. దీంతో ఆకాశం మొత్తం అగ్నిగోళాన్ని తలపించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కాలిఫోర్నియా అధికారులు సూచించారు. ఘటనకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో శుద్ధి కర్మాగారం నుంచి పెద్ద శబ్దంతో మంటలు ఎగసిపడుతున్నట్లు కనిపించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.నివేదికల ప్రకారం.. చెవ్రాన్స్ చమురు శుద్ధి కర్మాగారం కాలిఫోర్నియాలో రెండో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. ఇది రోజుకు 276,000 బ్యారెళ్లకు పైగా ముడి చమురును ప్రాసెస్ చేస్తుంది. వీటిలో గ్యాసోలిన్, జెట్, డీజిల్ ఇంధనాలు ఉన్నాయి. ఈ శుద్ధి కర్మాగారం దాదాపు 1.5 చదరపు మైళ్లు (3.9 చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉంది.
లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి?
వాతావరణ మార్పు LA మంటలకు కారణం కాదు. మంటలను రగిలించిన నిప్పురవ్వలు దాదాపుగా మానవులు సృష్టించినవే, బహుశా విద్యుత్ లైన్లు లేదా బాణసంచా వల్ల కావచ్చు.
2025 లో లాస్ ఏంజిల్స్లో ఏమి జరిగింది?
2025 జనవరిలో లాస్ ఏంజిల్స్ కౌంటీలో సంభవించిన వినాశకరమైన కార్చిచ్చుల శ్రేణి 31 ప్రత్యక్ష మరణాలకు దారితీసిందని కాలిఫోర్నియా అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి, అయితే స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు హెల్సింకి విశ్వవిద్యాలయం చేసిన కొత్త అధ్యయనం వాస్తవ మరణాల సంఖ్య దాదాపు 15 రెట్లు ఎక్కువగా ఉందని సూచిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: