हिन्दी | Epaper

Masoud Pezeshkian: గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

Saritha
Masoud Pezeshkian: గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

Masoud Pezeshkian: అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ (Iran) విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన ఓ వీడియోలో మాట్లాడారు.

Read Also: Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం

Masoud Pezeshkian: గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
Masoud Pezeshkian: Iranian President Apologizes to Gulf Countries

గల్ఫ్ దేశాలపై ఇక దాడులు ఉండవు

ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలపై ఇకపై ఎలాంటి దాడులు జరగబోవని పెజెష్కియాన్ ప్రకటించారు. అయితే, పొరుగు దేశాలు తమపై ప్రత్యక్ష దాడికి దిగితే మాత్రం.. స్పందించే హక్కు తమకు ఉందన్నారు. ఈ మేరకు దేశ తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల తాము దాడులు చేసిన దేశాలకు క్షమాపణలు కూడా చెప్పారు. వాటిపై దాడులు చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పెజెష్కియాన్ దీన్ని తోసిపుచ్చారు. ఇరాన్ను లొంగదీసుకోవాలన్న కలలను వారు సమాధి చేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.

ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ ఇస్లామిక్ రిపబ్లిక్‌లోని లక్ష్యాలపై దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పెజెష్కియాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870