ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో(maria corina machado) ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు.






