అమెరికా బలగాలు వెనుజులా రాజధాని కారకాస్‌పై దాడి చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా, మరియా కొరినా మచాడో (Maria Corina Machado) స్పందించారు. వెనిజులాలో ‘స్వేచ్ఛా గడియలు’ ప్రారంభమయ్యాయని ప్రతిపక్ష నేత, నోబెల్ గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ‘అధ్యక్షుడు మదురో చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నారు.
అమెరికా మాట నిలబెట్టుకుంది
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ఆయన నిరాకరించడంతో చట్టాన్ని అమలు చేస్తామన్న తన మాటను అమెరికా నిలబెట్టుకుంది. ఇకపై దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యమేలుతుంది. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తాం’ అని మచాడో (Maria Corina Machado) Xలో పోస్ట్ చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: