ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన తర్వాతే చర్చలు వేడెక్కాయి. ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ గౌరవం లభించలేదు. బదులుగా, వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో(Machado) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకునేందుకు ఎంపికయ్యారు. డిసెంబర్ 10న నార్వేలో జరిగే అవార్డు కార్యక్రమానికి ఆమె హాజరవుతారో లేదో అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. ఎందుకంటే మచాడో దాదాపు ఏడాదిగా అజ్ఞాతంలో ఉంటూ, వెనిజులా ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు.
Read Also: GeorgeHWBush: బుష్–ఏలియన్ రహస్యాల సంచలనం

వెనిజులా ప్రభుత్వం ఆమెపై కుట్ర, విద్వేష ప్రేరేపణ, ఉగ్రవాదానికి మద్దతు వంటి తీవ్రమైన కేసులు నమోదు చేసి, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలుగా పరిగణిస్తున్నట్లు అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ తెలిపారు. దేశం దాటి బయటకు వెళ్తే, ఆమెపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
డిసెంబర్ 10న నోబెల్ అవార్డుల ప్రదానోత్సవం
ప్రతి సంవత్సరం ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి(Alfred Nobel’s death anniversary) సందర్భంగా డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు. 1901లో మొదలైన ఈ సాంప్రదాయంలో భాగంగా, ఈ ఏడాది కూడా పురస్కారం పాటు 10 లక్షల డాలర్ల నగదు బహుమతి అందజేయనున్నారు. మచాడో(Machado) ఈ కార్యక్రమానికి హాజరవ్వాలంటే తప్పనిసరిగా తన అజ్ఞాతం నుంచి బయటకు రావాల్సిందే. కానీ దేశం విడిచే క్షణమే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున, ఆమె ఈ వేడుకకు రావడం కష్టంగా మారింది.
మచాడోను ఎందుకు ఎన్నుకున్న నోబెల్ కమిటీ?
నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకారం,
- వెనిజులా ప్రజల హక్కుల కోసం మచాడో ఎన్నాళ్లుగానో చేస్తున్న పోరాటం
- ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాగిస్తున్న ఉద్యమం
వీటిని గుర్తించి ఆమెకు ఈ అవార్డు ఇచ్చినట్లు ప్రకటించారు.
గత ఏడాది నుంచీ తీవ్ర ముప్పు ఉన్నప్పటికీ, ఆమె తాను ఉన్న దేశాన్ని విడిచిపెట్టకుండా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారని కమిటీ పేర్కొంది. మచాడోను “శాంతి ఛాంపియన్”, లాటిన్ అమెరికా ప్రజల ధైర్యసాహసాలకు ప్రతీకగా అభివర్ణించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: