JNIM terrorists: ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి(Maali) దేశానికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యువకుడు ప్రవీణ్ ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న ఘటన సెన్సేషన్‌గా మారింది. గత నెల 23న డ్యూటీ ముగించుకుని గదికి తిరిగి వెళ్తుండగా, JNIM అనే తీవ్రవాద సంస్థ సభ్యులు అతడిని అపహరించినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో ప్రవీణ్ కుటుంబం, గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. అతడిని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read Also: Russia: పుతిన్ భారత్ పర్యటనపై అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్
రోజూ ఫోన్ చేసేవాడు… అకస్మాత్తుగా అదృశ్యం
బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్, నల్లమాస జంగయ్య-మహేశ్వరి దంపతుల రెండో కుమారుడు. ఉపాధి కోసం గతేడాది నవంబరులో బోర్‌వెల్ కంపెనీ(Borewell Company) ఉద్యోగిగా మాలి(Maali) దేశంలోని కోబ్రి ప్రాంతానికి వెళ్లాడు. ప్రతిరోజూ ఉదయం ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రుల్ని మాట్లాడుకునే ప్రవీణ్, నవంబర్ 22న చివరిసారి ఫోన్ చేశాడు. ఆ తర్వాత అతని మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.

JNIM దుండగుల చెరలో తెలుగు యువకుడు
డిసెంబర్ 4న బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు కాల్ చేసి, నవంబర్ 23న JNIM దుండగులు ప్రవీణ్‌ను కిడ్నాప్(Kidnapping) చేశారని నిర్ధారించారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా విదేశీయులను ఈ సంస్థ అపహరించిన ఘటనలు ఉన్నట్లు తెలిసింది.
ప్రవీణ్ కోసం బోర్‌వెల్ సంస్థ అధికారులు ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆయనను సురక్షితంగా స్వదేశానికి పంపేలా భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు. గ్రామమంతా ప్రవీణ్ ఆరోగ్యంగా తిరిగి వస్తాడన్న ఆతృతతో ఎదురు చూస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: