అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మరోసారి భారత భూభాగంపై అడుగుపెట్టబోతున్నాడు. ఫుట్‌బాల్ ప్రపంచంలో అగ్రశ్రేణి ఆటగాడిగా గుర్తింపు పొందిన మెస్సీ, ఈసారి భారత్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. డిసెంబర్ 13 నుండి 15 వరకు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో పర్యటించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. గత 14 ఏళ్లలో మెస్సీ భారత్‌లో అడుగుపెట్టడం ఇది రెండోసారి కావడం విశేషం. చివరిసారి 2011లో ఆయన కోల్‌కతా (Kolkata) లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్జెంటీనా జట్టు వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత మెస్సీని ప్రత్యక్షంగా చూడాలనే కోరికతో అభిమానులు ఈసారి విపరీతంగా ఎదురుచూస్తున్నారు.ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ఈ పర్యటనను ధృవీకరించాయి.
కోట్లాది అభిమానులను
డిసెంబర్ 14న మెస్సీ ముంబై వాంఖడే స్టేడియంలో అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ (Virat Kohli) తో కలిసి ఓ ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నట్లు సమాచారం. ఫుట్‌బాల్ మైదానంలో ప్రత్యర్థులను మాయ చేసే తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీ, ఈసారి క్రికెట్ బ్యాట్ పట్టి తన అభిమానులను అలరించనున్నారు.ఆ రోజు గ్రౌండ్‌ను బ్లాక్ చేయాలని ఎంసీఏను ఓ ఏజెన్సీ కోరింది. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆ విన్నపాన్ని ఆమోదించారు. భారత దిగ్గజ ఆటగాళ్లతో మెస్సీ ఆడేలా నిర్వాహకులు ప్రణాళికలను సిద్ధం చేశారు. షెడ్యూల్ ఫైనల్ అయిన తర్వాత ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.’అని ముంబై క్రికెట్ అసోసియేషన్ (Mumbai Cricket Association) వర్గాలు మీడియాకు తెలిపాయి.

మెస్సీ వర్క్‌షాప్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మాన కార్యక్రమంలో లియోనెల్ మెస్సీ పాల్గొంటాడని తెలుస్తోంది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. కోల్‌కతాలోని చిన్నారుల కోసం మెస్సీ వర్క్‌షాప్ నిర్వహిస్తాడని కూడా తెలుస్తోంది.అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ అక్టోబర్ లేదా నవంబర్‌లో కేరళలో పర్యటిస్తుందని ఆ రాష్ట్ర మంత్రి అబ్దుల్ రహిమాన్ జూన్‌లో తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతారని పేర్కొన్నారు. కానీ మెస్సీ డిసెంబర్‌లోనే భారత్‌కు వస్తాడని ప్రచారం జరుగుతుండటంతో కేరళకు వెళ్లడం కష్టమనే అభిప్రాయం కలుగుతోంది.
మెస్సీ ఎప్పుడు పుట్టారు?
లియోనెల్ మెస్సీ జూన్ 24, 1987న అర్జెంటీనా దేశంలోని రోసారియో పట్టణంలో జన్మించారు.
మెస్సీ భారత్‌కి రావడం ఎన్ని సార్లు జరిగింది?
ఇప్పటివరకు మెస్సీ భారత్‌కు రెండు సార్లు వచ్చారు. 2011లో ఒకసారి, ఇప్పుడు 2025 డిసెంబర్‌లో రెండోసారి పర్యటించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Oval Test 2025: కేఎల్ రాహుల్, అంపైర్ ధర్మసేన మధ్య వాగ్వాదం – పూర్తి వివరాలు