Layoffs ఐటి రంగంలో ఉద్యోగుల (employees) పనితీరును పర్యవేక్షించడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల కాగ్నిజెంట్ (Cognizant) తీసుకున్న నిర్ణయం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన ల్యాప్ టాప్ లేదా డెస్క్టాప్పై ఎలా పనిచేస్తున్నారు? ఎంతసేపు పని చేస్తున్నారు? మధ్యలో ఎంతసేపు బ్రేక్ తీసుకుంటున్నారు? అన్న అంశాలన్నీ కంపెనీ నేరుటా ట్రాక్ చేయడం ప్రారంభించింది. దీనికోసం కంపెనీ ప్రత్యేకమైన మానిటరింగ్ సాఫ్ట్వేర్లను అమలు చేసింది.
Read Also: Bihar: నితీశ్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న చంద్రబాబు, లోకేశ్..

కీబోర్డు ఐదునిమిషాలు ఉపయోగించకపోతే కొత్తగా అమలు చేసిన ఈ వ్యవస్థ ప్రకారం.. ఉద్యోగి తన కీబోర్డు లేదా మౌస్ ను ఐదు నిమిషాల పాటు ఉపయోగించకపోతే, ఆ వ్యక్తి ఖాళీగా ఉన్నట్లు సిస్టమ్ గుర్తిస్తుంది. అదే 15 నిమిషాలకు పైగా ఎలాంటి కార్యకలాపం లేకపోతే, ఆ ఉద్యోగి కంప్యూటర్ ముందు లేదా లేదా వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నాడా అని పరిగణిస్తుంది. కంపెనీ ఈ డేటాను (data)సేకరించడానికి ప్రోహ్యన్స్ వంటి టూల్స్ ను ఉపయోగిస్తోంది. ఈ టూల్ ఉద్యోగి ఏ అప్లికేషన్ ను ఎంతసేపు ఉపయోగిస్తున్నాడు? ఏ పనిపై ఎంత సమయం ఖర్చు చేస్తున్నాడు? అనే వివరాలను కూడా క్షుణ్ణంగా రికార్డ్ చేస్తుంది.
ఉద్యోగుల్లో ఆందోళన
అయితే ఈస్థాయి ట్రాకింగ్ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే ఏఐ కారణంగా ఉద్యోగ భద్రతపై సందేహాలు నెలకొన్న సమయంలో ఇలాంటి కఠినమైన పర్యవేక్షణ మరింత ఒత్తిడిని పెంచుతోందని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. కొన్ని జట్లు ఈ మానిటరింగ్ రూల్స్ ను కొంచెం సడలింపుతో అమలు చేస్తుండగా మరికొన్ని జట్లు చాలా కఠినంగా పాటిస్తున్నాయని సమాచారం. అయితే కాగ్నిజెంట్ ఉద్యోగుల భయాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ డేటాను ప్రమోషన్లు, పనితీరు అంచనాలు లేదా బోనస్ వంటి అంశాలకు ఎలాంటి సంబంధం పెట్టబోమని కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగి అనుమతితోనే ఈ టూల్స్ ను ఉపయోగిస్తున్నామని కూడా చెబుతోంది.
కాగ్నిజెంట్ దీనిపై ఏమంటున్నది?
ఈ టూల్స్ పనితీరు కొలిచేందుకు కాదు, క్లయింట్ వర్క్ లో ఉన్న అసమర్థతను, అడ్డంకులను గుర్తించడానికి మాత్రమే ఉపయోగిస్తారు అని, ప్రాసెస్ ట్రాన్స్ ఫర్మేషన్ లక్ష్యాలతో, ఏ దశ ఎక్కువ సమయం తీసకుంటోంది? ఏ వర్క్ లో ఆలస్యం జరుగుతోంది? వంటి అంశాలను అర్థం చేసుకోవడంలో ఇవి సహాయపడతాయని కంపెనీ స్పష్టం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: