రోహిత్ శర్మ‘హిట్‌మ్యాన్’గా పేరుగాంచిన రోహిత్, వన్డే క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. ముఖ్యంగా ఆయన బాదిన మూడు డబుల్ సెంచరీలు ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయాయి. వన్డే క్రికెట్ (ODI Cricket) లో ఒకే ఆటగాడు మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించడం అరుదైన ఘనత. రోహిత్ సాధించిన ఆ మైలురాళ్లు ఆయన ప్రతిభ, సహనం, స్ట్రోక్ ప్లేకు నిదర్శనం.2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ చేసిన ప్రదర్శన మరువలేనిది. ఆ టోర్నీలో ఆయన వరుసగా సెంచరీలు సాధిస్తూ టీమిండియాను సెమీఫైనల్స్ వరకు నడిపించాడు. ఆ వరుస సెంచరీలు రోహిత్ కెరీర్‌లోనే కాదు, వరల్డ్‌కప్ చరిత్రలో కూడా ఒక గోల్డెన్ చాప్టర్‌గా నిలిచాయి. అప్పట్లో హిట్ మ్యాన్ పది ఓవర్ల తర్వాత కూడా క్రీజులో ఉంటే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ (England bowler Mark Wood) కూడా చెబుతున్నాడు.ప్రస్తుత క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా నిలిచిన ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్, భారత బ్యాటర్లలో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడని చెప్పాడు.
నా కెరీర్‌లో రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని అనిపించింది
గాయాలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా తాను అనుకున్నన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయినా, భారత్‌పై ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన వుడ్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.“నా కెరీర్‌లో రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని అనిపించింది. షార్ట్ బాల్ వేసినప్పుడు అతడిని ఔట్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. కానీ అతడు ఆ రోజు ఫామ్‌లో ఉంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. బంతిని ఎంత గట్టిగా బాదుతాడంటే ఆపడమే కష్టం అవుతుంది. అతడి బ్యాట్ చాలా పెద్దగా అనిపించేది, ఎప్పటికప్పుడు ఇంకా పెద్దదవుతున్నట్టే అనిపించేది” అని వుడ్ ది ఓవర్‌లాప్ క్రికెట్ పాడ్‌కాస్ట్ (Overlap Cricket Podcast) లో చెప్పాడు.“కోహ్లీ విషయానికి వస్తే, అతడు అద్భుతమైన పోటీదారు. నాలుగు, ఐదో స్టంప్ ప్రాంతంలో బౌలింగ్ చేస్తే అక్కడ అతడికి బలహీనత ఉందని అనిపించేది. కానీ నేను అక్కడ వేసినప్పుడు అతడు ఒక్కసారి కూడా తప్పించుకోలేదనిపించేది. కాబట్టి అది కూడా కష్టం” అని వుడ్ అన్నాడు.

బౌలింగ్‌లో మిక్స్ అవసరం
టీమిండియా క్రికెటర్లలో తాను ఎదుర్కొన్న క్లిష్టమైన మూడో బ్యాటర్ రిషబ్ పంత్ అని చెప్పుకొచ్చాడు. “పంత్‌పై బౌలింగ్ చేయాలంటే ధైర్యాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే అతడు చాలా అంచనా వేయలేని ఆటగాడు. అతడు అక్కడే నిలబడి కఠినమైన బంతి కోసం వేచి చూసి దానిని ఆడతాడు. కానీ ఎప్పుడూ ఒకే రకమైన బౌలింగ్ చేస్తే తనకు నచ్చిన చోట బంతిని కొడతాడు” అని వుడ్ వివరించాడు.“అందుకే బౌలింగ్‌లో మిక్స్ అవసరం. పాత బంతి అయితే అది ఎప్పుడూ అంచనా వేయలేనిది. స్లోయర్ బాల్, లేదా చాలా ఎత్తైన బౌన్సర్, లేదా వేగవంతమైన యార్కర్ లాంటి చిన్న చిన్న మార్పులు చేయాలి” అని మార్క్ వుడ్ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు.
రోహిత్ శర్మను ఏ పేరుతో పిలుస్తారు?
ఆయనను అభిమానులు “హిట్‌మ్యాన్” అని పిలుస్తారు.
రోహిత్ శర్మ వన్డేల్లో చేసిన విశేష రికార్డు ఏమిటి?
వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: